Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్బీ
ప్రతి సమస్యనూ సామరస్యంగా చర్చించి త్వరిత గతిన పనులను పూర్తి చేస్తానని హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్ రావు అన్నారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని వెస్టర్న్ హిల్స్ సొసైటీ అడ్డ గుట్ట కాల నీలో హాస్టల్ బిల్డింగ్ ఓనర్స్, బిల్డింగ్ లీజుదారుల సమస్య లు, ప్రజలు హాస్టల్స్ వల్ల పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మిగతా సమస్యలపై జరిగిన అవగా హన కార్యక్రమంలో కేపిహెచ్బీ లా అండ్ ఆర్డర్ సీఐ కిషన్ కుమార్, ట్రాఫిక్ సీఐ నరసింహా రావు, జలమండలి డీజీఎం వెంకటేశ్వర్లు, మేనేజర్ ప్రశాంతి, జీహెచ్ఎంసీ డాక్టర్ మమత, ఇంజినీరింగ్ ఏఈ రాజీవ్, వర్క్ ఇన్ స్పెక్టర్ మహదేవ్తో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నిత్యం ప్రజలు ట్రాఫిక్ సమస్యలతో సతమవుతున్నారన్నారు. డ్రైనేజ్ నీరు రోడ్డు మీద పొంగి పొర్లి రోడ్లు మొత్తం చెరువులను తలపిస్తున్నా యనీ, ఇలాంటి సమస్యలపై అన్ని డిపార్ట్మెంట్ వారితో అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పారు.