Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి ప్రతిరోజూ వ్యాయామం చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం బాలాజీ నగర్ డివిజన్లోని పార్కులను ఆయన పరిశీలించి మాట్లాడారు. ప్రత్యేకంగా మహిళలకు, చిన్న పిల్లలకు పార్కులను రూపొందించామన్నారు. ఒక్కొక్క పార్కు ఒక్కొక్క రకమైన తీమ్తో రూపొందించామన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడికి అక్కడ క్రీడలుకు సంబంధించి ఇండోర్ స్టేడియంలు, షటిల్ కోర్టులు, ఓపెన్ జిమ్‌లు, పార్కులు ఈ విధంగా రూపొందిస్తున్నామన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఎక్కడా రాజీ పడకుండా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వెంటనే నిధులు కేటాయిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో సుందరంగా రూపుదిద్దుకుంటున్న పార్కుల విషయంలో ఇంకా నిధులు కొరత ఉంటే వెంటనే సంప్రదించాలని అధికారులకు ఆదేశించారు. పార్కుల్లో కొన్ని మార్పులను సూచించి డీఈ ఆనంద్కి తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పగుడాల శిరీష బాబురావు, డీఈ ఆనంద్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.