Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్బీ
గుడి, బడి, ఇల్లు ఈ మూడు వ్యవస్ధలు సంస్కారాన్ని, సౌజన్యాన్ని, సచ్ఛీలతను మనుషుల్లో పెంపొందించగలి గితే ఈ సమాజం ఇంత అస్తవ్యస్తంగా, ఇంత రాక్షసంగా ఉండదని మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిజాంపేట రోడ్డులోని శ్రీశ్రీ హౌలిస్టిక్ హాస్పిటల్లో హాస్పిటల్ ఛైర్మన్ డా.వి.ఎస్.రామచంద్ర అధ్యక్షతన జరిగిన సభకు ఆయనతో పాటు చిత్రవాణి డీప్యూటీ డైరెక్టర్ ఐనంపూడి శ్రీలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజర య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన భారతీయ సంస్క్రతిలో స్త్రీకి ఎంతో గౌరవప్రదమైన స్ధానం ఉందన్నారు. చిత్రవాణి డీప్యూటీ డైరెక్టర్ ఐనంపూడి శ్రీలక్ష్మి మాట్లాడుతూ మన పిల్లలు వివక్ష, హింస, లైగింక దాడులు లేని సమాజంలో బతకాలంటే దానికి పునాది కుటుంబంలోనే పడాలన్నారు. స్త్రీలు, పురుషులు ఆ పునాదిని దృఢతరం చేయడానికి కృషి చేయాలన్నారు. అనంతరం ఐదుగురు ధీర మహిళలను సత్కరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నందర్భంగా నిర్వ హించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో 108 ఫౌండర్ వెంకట్, కార్పొరేటర్ సత్యవతి, హాస్పిటల్ ఫౌండర్ లక్ష్మీనారాయణ, మేనేజింగ్ డైరెక్టర్ డా.తుషార, డా.ఆలూరి విజయలక్ష్మి, డా.పాపినేని సుబ్బారావు, డా.అమృత, డా.నిఖిల, ప్రసన్న కుమారి, మాలిని, హేమలత, లక్ష్మి, సుధ, హాస్పటల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.