Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
అంతర్జాతీయ మహిళ దినోత్సవంను పురస్కరించుకుని వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని పిజెఅర్ ఫంక్షన్ హాల్లో కార్పొరేటర్ రోజాదేవి రంగారావు ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొని మహిళలను సన్మానించి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల కోసం ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అంది వచ్చిన అవకాశాలను పునికిపుచ్చుకుని అన్ని రంగాల్లో ప్రావీణ్యం సాధించి ఎంచుకున్న రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి ఇతరులకు ఆదర్శంగా నిల వాలన్నారు. ఆర్థిక స్వాలంబన పొందాలనీ, పురుషులతో సమానంగా పోటీ పడాలనీ, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలియజేస్తూ 'స్త్రీ' లేకపోతే జననం లేదు, గమనం లేదు, ' సృష్టిలో జీవం లేదు 'స్త్రీ 'లేకపోతే అసలు సృష్టే లేదనీ, సమాజాన్ని కంటిపాపలా కాపాడే 'స్త్రీ' మూర్తికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తు న్నాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు సంజీ వరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఆంజనేయులు, మోజేశ్, చంద్రమోహన్ సాగర్, విద్యాసాగర్, రాము, శివ సాగర్, సంపత్, శ్రావణి రెడ్డి, స్వరూప, విజయ, రాధాబాయి, భారతమ్మ, కమలమ్మ, నరసమ్మ, లక్ష్మి, కవిత, లక్ష్మి, సరితా, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.