Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఇంగ్లీష్ పేపర్-1 పరీక్ష శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. జిల్లా పరిధిలో మొత్తం 86270 మంది విద్యార్ధులకుగాను 83303 మంది విద్యార్ధులు హాజరుకగా.. 2967 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సెయింట్ జార్జ్ బార్సు అండ్ గర్ల్స్ కాలేజీలతో పాటు మహబూబియా, అలియా కాలేజీలను తనిఖీ చేశారు. ఆయన వెంట ఇంటర్మీడియట్ అధికారి ఒడ్డెన్న ఉన్నారు. ఇంగ్లీష్ పేపర్-1 పరీక్షలో ఎలాంటి మాల్ ప్రాక్టిస్ కేసు నమోదు కాలేదని అధికారులు పేర్కొన్నారు.