Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
వరద కాలువా.. లేక కచరాతో నింపిన డంపింగ్ యార్డా..? అనే అనుమానం కలిగేలా తయారైం కూకట్ పల్లి ప్రశాంత్ నగర్ కోర్టు సమీపంలోని వరద కాలువ పరిస్తితి. పూర్తిగా చెత్తా, చెదారం ప్లాస్టిక్ డబ్బాలు వంటి వ్యర్థాలతో నిండిపోయి వరద నీరు సైతం కనిపించకుండా వ్యర్థాలతో కప్పబడి ఉంది. కాలువకు ఆనుకుని భవన నిర్మాణ వ్యర్ధాలు నింపి వరద కాలువ కనిపించకుండా చేస్తున్నారు. ఇది ఇలాగే ఉంటే ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలకు ఎగువ నుంచి వచ్చే వరద నీరు ఎక్కువైతే కాలువ ద్వారా కాకుండా, కాలువ పై నుంచి వరద ప్రవ హించే ప్రమాదముంది. కాలువ పరివహకంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉండటం వల్ల అక్కడి చెత్త పూర్తిగా కాలవలో వేసి చెత్తతో నింపడం వల్లనే వరద కాలువ పూర్తిగా వ్యర్థాలతో నిండి పోతుందనీ, పరిసర ప్రాంతాల్లోని పరిశ్రమల వారు చెత్తను కాలువలో వేయ కుండా, సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులు వారికి అవ గాహన కల్పించి, వరద నీరు పారేందుకు అడ్డంకులు తొల గించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.