Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
మైసమ్మగూడలోని నర్సింహరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ శాఖ వారి ఆధ్వర్యంలో శుక్రవారం అడ్వాన్సస్ ఇన్ సర్వేయింగ్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ పై రెండు రోజులపాటు జాతీయ స్థాయి వర్క్ షాప్ నిర్వహించనున్నారు. మొదటి రోజులో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా భారతీయ భూగర్భ సర్వేక్షణ డైరెక్టర్ జనరల్ డా,ఎన్.కుటుంబరావు, ఎన్ఐసీఎంఏఆర్ ప్రొఫెసర్, డీన్ డా.ఇంద్రసేన సింగ్, ఎన్ఐసీఎంఏఆర్ ప్రోగ్రాం డైరెక్టర్ మురళీధర్, నీట్ వరంగల్ ప్రొ.డా.ఎం శశి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కుటుంబరావు మాట్లా డుతూ విద్యార్థుల ఆలోచనలు నూతన ఆవిష్కరణలు వైపు ఉండాలన్నారు. సివిల్, మెకానిక్ విభాగాలకు త్వర లోనే పూర్వ వైభవం వస్తుందన్నారు. ఇలాంటి కార్యక్ర మాల్లో విద్యార్థులు పాల్గొనడం వల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారన్నారన్నారు. ఇంద్రసేన సింగ్ మాట్లాడు తూ కేవలం సివిల్ విద్యార్థులే కాకుండా అన్ని విభాగాల విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. మురళీధర్ మాట్లాడుతూ ప్రపంచం సాంకేతికంగా ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో ప్రతి విద్యార్థి సాంకేతి కథపై నైపుణ్యం పెంపొందించుకోవాలన్నారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ ఎప్పటికప్పుడు సాంకేతికతను పెరుగుపరుచుకునే దిశగా అడుగులు వేయాలన్నారు. విద్యార్థి దశ ఎప్పటికప్పుడు అన్వేషణ, నూతన ఆవిష్క రణలు వైపు ఉండాలలన్నారు. విద్యార్థుల విద్యా ప్రమా ణం మెరుగుపరుచుకుంటూ, గమ్యం చేరేవరకు అలసిపో కుండా కష్టపడితేనే అనుకున్నది చేరుకోగలరన్నారు. నేటి ఈ విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే బావి భరత ఇంజినీర్లుగా తయారవ్వాలన్నారు. సమాజానికి ఉపయో గపడే నూతన ఆవిష్కరణ తీసుకురావాలని కోరారు. నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులుగా రూపుదిద్దుకు నేలా అడుగులు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కళా శాల చైర్మన్ జె.నర్సింహరెడ్డి, కార్యదర్శి జె,త్రిశూల్ రెడ్డి, కోశాధికారి జె.త్రిలోక్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డా.ఆర్. లోకనాథం, కార్యక్రమ కన్వీనర్ సివిల్ విభాగాధిపతి టియల్.రామదాసు, వివిధ విభాగాధిపతులు, వివిధ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.