Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
ప్రభుత్వం ప్రజల అభివృద్ధితో పాటు ఆరోగ్య రీత్యా అండగా నిలుస్తుందని దుండిగల్ మున్సిపల్ కమిషనర్ కె.సత్యనారాయణ తెలిపారు. దుందిగల్ మున్సిపల్ పరిధిలోని బహదూర్ పల్లి 15వ వార్డ్ శ్రీరామ్ కాలనీలో శుక్రవారం రెండో విడత ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కంటి వెలుగు కార్యక్రమంను మున్సిపల్ కమీషనర్ సత్యనారాయణ రావు, కౌన్సిలర్ నర్సింగం భారత్ కుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ అర్హులన్నారు. కంటి పరీక్షలకు వెళ్ళేవారు తప్పనిసరిగా ఆధార్ కార్డ్ తీసుకువెళ్లాలని కోరారు. కంటి వెలుగు కేంద్రాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు సంబంధిత వైద్య సిబ్బంది పరీక్షలు చేస్తారనీ, అనంతరం పూర్తి ఉచితంగా కంటి వైద్య పరీక్షలు చేసి కళ్లద్దాలు ఉచితంగా పంపిణీ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నర్సింగం భారత్ కుమార్, కౌన్సిలర్ అమరం గోపాల్ రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ అంజయ్య, ఆరోగ్య వైద్య, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.