Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ ఫేస్ -1, శ్రీనివాస్ నగర్ ఫేస్ -2 మెయిన్ రోడ్డులో శుక్రవారం నుంచిి కురుస్తున్న కొద్దిపాటి వర్షానికి రోడ్లపై వర్షపు నీళ్లు నిలిచిపోయాయని కాలనీవాసులు తెలపడంతో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి కాలనీలో పర్యటించి వచ్చే వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని నూతన స్త్రొమ్ వాటర్ (యూజీడి) లైన్ నిర్మించాలని జీహెచ్ఎంసీ అధికారులను బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, జహంగీర్, రామచందర్, నరేందర్ రెడ్డి, మల్లేశ్వర్, రాజేందర్, ఈశ్వర్ గౌడ్, గోపాల్ రెడ్డి, సీతారామయ్య, మహేష్, శ్రీను, అశోక్, జగన్, తదితరులు పాల్గొన్నారు.