Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
జీడిమెట్లలోని పారిశ్రామికవాడలో మూసివేసిన కోపల్లి ఫార్మా ఆవరణలో గురువారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
నేడు మోడీ బిల్డర్లో మెడికల్ క్యాంపు
కెమికల్ కంపెనీకి పరిసర ప్రాంతాలైన మోడీ బిల్డర్స్, జనప్రియ అపార్ట్మెంట్స్, అపురూప కాలనీ, ఎస్ ఆర్ నాయక్ నగర్ ప్రాంతాల ప్రజల ఆరోగ్య దృష్ట్యా
మల్లారెడ్డి హాస్పిటల్ చైర్మన్ భద్రారెడ్డి సహకారంతో నేడు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నట్టు కార్పొరేటర్ సురేష్‌రెడ్డి తెలిపారు. సుమారు 540 కుటుంబాలు మోడీ బిల్డర్స్‌లో ఉన్నాయనీ, ఎవరైనా ఎమర్జెన్సీకి గురైతే వెంటనే మల్లారెడ్డి హాస్పిటల్లో ఉచితంగా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చని సురేష్ రెడ్డి చెప్పారు. సమీప ప్రాంతంలోని బిల్డింగ్‌లకు ఏమైనా నష్టం జరిగితే, కంపెనీ యజమాన్యం నష్టపరిహారం చెల్లించాలని సూచించారు. సురేష్‌రెడ్డి వెంట స్థానిక నాయకులు, మహిళలు, తదితరులు ఉన్నారు.