Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడ్జెట్లో బీసీల వాటా పెంచాలి
- అఖిలపక్ష సమావేశానికి హాజరు కండి
- మంత్రి గంగుల కమలాకర్‌కు వినతి
నవతెలంగాణ-అడిక్‌మెట్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీల వాటా పెంచాలనీ, బీసీలను చిన్న చూపు చూడడం తగదని బీసీ సంక్షేమ సంఘం నాయకులు అన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగే అఖిలపక్ష సమావేశానికి హాజరు కావాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రూ.45 లక్షల కోట్ల బడ్జెట్ లో 56శాతం గల బీసీలకు కేవలం రూ.2వేల కోట్లు కేటాయించడం బీసీలను తీవ్రంగా అవమానించడం అన్నారు. జనాభా దామాషా ప్రకారం బీసీల బడ్జెట్ పెంచాలని డిమాండ్ చేశారు. స్వాత ంత్రం సిద్ధించిన నాటి నుంచి జనగణనలో బీసీ కుల గణన ఇంతవరకు చేపట్టలేదన్నారు. త్వరలో చేపట్టబోయే జనగణలో బీసీ కులాల గణన చేపట్టాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తుం దన్నారు. ప్రజల సంపదను ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో రిజర్వేషన్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉపాధి పొందుతారనీ, అలాంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ పేదవారి పొట్ట కొడుతున్నారన్నారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పిం చాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, బీసీ యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ రాజ్ కుమార్, బీసీ సంక్షేమ సంఘం గ్రేటర్ హైద రాబాద్ అధ్యక్షులు భూపేష్ సాగర్, రాష్ట్ర ప్రధాన కార్య దర్శి నందగోపాల్ కోల జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.