Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య
- కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి వీరేంద్ర సింగ్కు వినతి
నవతెలంగాణ-అడిక్మెట్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు అమలు చేసే ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్, హాస్టళ్ళ నిర్వహణ, గురుకుల పాఠశాలల నిర్వహణ, బీసీ కార్పొరేషన్ రుణాలు లాంటి పలు పథకాలకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం గ్రాంటు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్.కృష్ణయ్య, బీద మాసాన్ రావు డిమాండ్ చేశారు. కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి వీరేంద్ర సింగ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బీసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అభివృద్ధికి ఎలాంటి పథకాలు అమలు చేయడం లేదన్నారు. పైగా రాష్ట్రాలు అమలు చేస్తున్న స్కీములకు గ్రాంటు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఫీజు రీయింబ ర్స్మెంట్, స్కాలర్షిప్ పథకంకు 60 శాతం గ్రాంటు ఇవ్వాలి లని కోరారు. హాస్టళ్ళు, గురుకుల పాఠశాల నిర్వహణ పథకముకు 60 శాతం గ్రాంటు ఇవ్వాలనీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 370 బీసీ కాలేజీ హాస్టళ్ళు, 134 బీసీ రెసిడ ెన్షియల్ పాఠశాలలు, తెలంగాణలో 290 బీసీ కాలేజీ హాస్టళ్ళు. 280 బీసీ గురుకుల పాఠశాలలు అద్దె భవనా లలో కొనసాగుతున్నాయనీ, వీటికి స్వంత భవనాలు నిర్మించడానికి 80 శాతం గ్రాంటు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. తెలంగాణలో రెండు బీసీ కార్పొరేషన్లు 12 బీసీ కుల ఫెడరేషన్లు కొనసాగుతున్నాయనీ, వీటి ద్వారా ఒక్కొక్క కుటుంబానికి రూ.లక్ష నుంచి రూ.20 లక్షల వరకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. బీసీల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించడానికి హాస్టళ్లకు, గురుకుల పాఠశాలకు 60 శాతం బాలికల కాలేజీ హాస్టళ్లకు, గురుకుల పాఠశాలకు 80 శాతం గ్రాంటు మంజూరు చేస్తామని కేంద్రమంత్రి హామీనిచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వెంగళరావు రాంచందర్ రావు, బీసీ నాయకులు గుజ్జు కృష్ణ పాల్గొన్నారు.