Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ
నవతెలంగాణ-అడిక్మెట్
చట్టాలను గౌరవించి వాటిని సక్రమంగా నడపాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చట్టాల ఉల్లంఘనకై నిర్విరామంగా కృషి చేస్తుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ అన్నారు. శుక్రవారం విద్యానగర్ బీసీ భవన్లో బీసీ నాయకుల సమావేశానికి హాజరైన ఎర్ర సత్యనారాయణ మాట్లాడుతూ దర్యాప్తుల విచారణను దీటుగా ఎదుర్కోవాల్సింది పోయి చట్టాలను విధిగా గౌర వించాల్సిన స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుమారుడు కుమార్తెల కోసం అందుకు విరుద్ధంగా చట్టాల ఉల్లంఘనకు పాల్పడుతున్నా దురుద్దేశ్య పూర్వక ప్రయ త్నమే డీలే ట్యాక్టీస్ అన్నారు. ఆలే నరేంద్ర, ఈటల రాజేందర్,. టి.రాజయ్యల దురుద్దేశ అవినీతి ఆరోపణలపై ముందుండి చర్యలకు దిగి కేసీఆర్ తన కూతురు కవిత అవినీతిపై రక్షించే ప్రయత్నాలు చేయడం ఏంటని ప్రశ్నిం చారు. గడిచిన 9ఏండ్లలో అధికార పార్టీ ఎన్నికల్లో రూ. వేల కోట్లు ఖర్చు చేసిందనీ, ఇన్ని కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అధికార కుటుంబం దుబారు కేంద్రంగా లక్షలాది కోట్లు విదేశాలకు తరలిస్తున్న ఆరోపణలు ప్రజా బహుళ్యలో, సంబంధిత వర్గాల సమాచారం ద్వారా చక్కెరలు కొడుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు తాత్సార్యం చేయటంలో అర్ధమేమిటని అన్నారు. చట్టాలను నడపా ల్సిన రాష్ట్ర ప్రభుత్వం, కవిత కేసులో చట్టాల ఉల్లంఘట నలకై నిర్విరామంగా కృషి చేయడం పట్ల తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి తన కుటుంబ రక్షణకే ప్రధాన ధ్యేయమైతే తక్షణమే రాజీచేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నీల వెంకటేష్, సుధాకర్ ముదిరాజ్, వేముల రామకృష్ణ రాంబాబు, మోడి రాందేవ్ పాల్గొన్నారు.