Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డితో కలిసి స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులను పరామర్శించారు. స్వప్న లోక్ కాంప్లెక్స్‌ను అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ స్పందిస్తూ సికింద్రాబాద్ స్వప్నలో కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాద ఘటన బాధాకరం అన్నారు. అంత చిన్న వయస్సు వాళ్లు ఇందులో చనిపో యారనీ, వరంగల్, మహబూబాద్ జిల్లాలోని ఐదు కుటుంబాల్లో ఈ ఘటన తీరని విషాదం నింపిందన్నారు. ప్రమాద ఘటన పై కమిటీ వేస్తున్నామనీ, క్లూస్ టీమ్ అధికారులు కాంప్లెక్స్‌లోని అన్ని అంతస్తుల్లో నమూనాలు సేకరిస్తున్నారని తెలిపారు. గతంలో కూడా ఈ పరిధిలో రెండు మూడు ప్రమాదాలు జరిగాయని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామనీ, చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటుందని డిప్యూటీ మేయర్ హామీనిచ్చారు.