Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
పేపర్ల లీకులను నిరసిస్తూ ఆయా పరీక్షలను రద్దు చేయాలని బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పార్టీ ఆఫీసులో ఆమరణ దీక్షను చేపడితే ఆ దీక్షను భగం చేసి ప్రవీణ్ కుమార్ని అరెస్ట్ చేసి ఆయన ఇంటికి తరలించి హౌస్ అరెస్ట్ చేయడాన్ని నిరసి స్తూ ఓయూలో బహుజన విద్యార్థి సంఘాలు, ఓయూ జాక్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించా రు. అనంతరం ఓయూ విద్యార్థి నాయకులు బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల సంజరు, ఓయూ జేఏసీ చైర్మైన్ కొత్తపల్లి తిరుపతి, ఉపాధ్యక్షుడు పులిగంటి వేణుగోపాల్, ఓయూ అధ్యక్షుడు పోమాల అంబేడ్కర్, తగరపు నవీన్, భాస్కర్, ప్రవీణ్ ఆనంద్, సత్యం, ఆనంద్, స్వామి యుగంధర్, తదితర నాయ కులను అరెస్టు చేసి ఓయూ పోలీస్ స్టేషన్కు తరలించారు.