Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
అబ్దుల్ మోసిన్ ఉస్మానియా యూనివర్సిటీ ఎన్ఆర్ఎస్ హాస్టల్లో వార్డ్ బాయ్‌గా హాస్టల్లో పనిచేస్తూ డ్యూటీ నుంచి తార్నాకకు పనిమీద వెళ్తుండగా యాక్సిడెంట్లో చనిపోయిన విషయం తెల్సిందే. బౌతికాయాన్ని వాళ్ళ ఇంటికికి యూనియన్ అధ్యక్షులు టి.మహేందర్, ప్రధాన కార్యదర్శి సీతారాం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్ రావుతో యూనియన్ నాయకులు వెళ్లి అతని కుటుంబానికి ప్రగాఢ సంతా పాన్ని తెలియజేశారు. ఉస్మానియా యూనివర్సిటీ కాంట్రాక్ట్, ఔట్ సోర్సంగ్ వర్కర్స్ యూనియన్ ప్రగాఢ సాను భూతి తెలియజేసి కాంట్రాక్టర్‌తో మాటా ్లడి అంత్యక్రియలకు ఖర్చుల కోసం వాళ్ళ భార్యకు రూ.10 వేలు అందజేశారు. నాయకులు ఓయూ చీఫ్ వార్డెన్ శ్రీనివాస్ రావుతో కుటుంబాన్ని ఆదుకోవాలని కోరగా.. సానుకూలంగా స్పందించారు. యూనియన్ అధ్యక్షులు టి.మహేందర్ మాట్లాడుతూ ఇటీవల ఓయూ యాజమాన్యం, కాంట్రాక్టర్ కలిసి మోసిన్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ, పీఎఫ్ చట్టం ప్రకారం మోసిన్ కుటుంబానికి రావాల్సిన అన్ని రకాల ప్రయో జనాలను తక్షణమే అందించా లని ఓయూ కమిటీ డిమాండ్ చేస్తున్నది. మోసిన్ కుటుంబం లోని ఒకరికి ఉద్యోగం ఇవ్వాల ని డిమాండ్ చేశారు. యూని యన్ ఓయూ అధ్యక్ష. కార్యద ర్శులు టి.మహేందర్, సీతా రాం, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్ రావు, ఉపాధ్యక్షులు శ్రీను, అన సూయ, శ్యామల, లక్ష్మణ్ గౌడ్, సహాయ కార్యదర్శులు నరేష్, శివ నాగరాజు, లక్ష్మణ, నాగ, స్వప్న, నాగరాణి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ మోహన్, బాలకృష్ణ సత్యం, శ్రీను, అంజమ్మ, సుజాత, రాణి, సుఖన్య, స్వప్న, డిమాండ్ చేశారు.