Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
సైబర్ నేరాల విషయంలో ప్రజలు మరింత అప్రమత్తమవ్వాలనీ, ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుటు ఒకటికి రెండుసార్లు సంస్థ మూలాలను ఖరారు చేసుకోవాలని విపణి గ్రూప్ సీఈఓ సుధాకర్ అన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తమ సంస్థ విపణి గ్రూప్ పేరును వాడుతూ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. బాధితులు తమను సంప్రదించిన తక్షణమే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఉన్నత విద్యను అభ్యసించి నిరుద్యోగంతో బాధపడుతున్న యువతకు తామే ఉపకార వేతనాలు చెల్లిస్తూ ఉద్యోగాలు కల్పిస్తున్న తమ సంస్థ నిరుద్యోగుల నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించదని చెప్పారు. విపణి పేరుతో ఉద్యోగాల్లో కల్పిస్తామని ఫోన్ ల ద్వారా గానీ, మెసేజ్ ల ద్వారా గానీ సంప్రదించే వారికి ఎలాంటి డబ్బులు చెల్లించవద్దని విజ్ఞప్తి చేశారు. మోసాలకు పాల్పడుతున్న వారికి తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తమ కంపెనీ పేరుతో ఇలాంటి ఫేక్ ఆఫర్లు కనిపిస్తే వాటికి స్పందిం చొద్దని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.