Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కామ్రేడ్ బి.మధుసూధన్ రెడ్డి
నవతెలంగాణ-తుర్కయంజాల్
రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడిన ధీరవనిత మల్లుస్వరాజ్యం అని సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కామ్రేడ్ బి.మధుసూధన్ రెడ్డి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, ఉక్కు మహిళా సీపీఐ(ఎం) సీనియర్ నాయకురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం ప్రథమ వర్ధంతిని రాగన్నగూడలోని సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కామ్రేడ్ బి.మధుసూదన్‌రెడ్డి బి.సామేల్‌లు మాట్లాడుతూ మల్లు స్వరాజ్యం ఉన్నత కుటుంబంలో జన్మించినప్పటికీ నాటి నైజాం రజాకారుల ఆగడాలకు వ్యతిరేకంగా ఆనాడు కమ్యూనిస్టుల నాయకత్వంలో సాగిన మహత్తర వీర తెలంగాణ సాయుధం రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించి నైజాం రజాకార్ల, దేశముకుల పటేల్ పట్వారి వ్యవస్థను నేల కూల్చిన వీర వనిత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు జి.కవిత, జిల్లా కమిటీ సభ్యులు డి.కిషన్, సి.హెచ్ జంగయ్య, అలంపల్లి నర్సింహ, పి.అంజయ్య, ప్రకాష్ కారత్, మల్లేష్, శారద, రామకృష్ణారెడ్డి, ముసలయ్య, సత్యనారాయణ, పంది జంగయ్య, కొండిగారి.శంకర్, ఎన్.యాదగిరి, ఇల్లూరి భాస్కర్, కుమార్, మాల్యాద్రి, రాజు, గణేష్, విజరు, రవీందర్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎల్బీనగర్ : మల్లు స్వరాజ్యం ప్రధమ వర్ధంతి సభ సరూరూనగర్ సర్కిల్ చైతన్యపురి మున్సిపల్ కాలనీ సీపీఐ(ఎం) కార్యాలయంలో సరూరూనగర్ కార్యదర్శి సిహెచ్ వెంకన్న అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ క్షవర వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చెన్నారం మల్లేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయన మాట్లాడుతూ పీడిత ప్రజల గొంతుకు, హక్కుల గళం పోరాట స్ఫూర్తి భూమి, భుక్తి, విముక్తి కోసం చేసిన పోరాటం మహత్తరమైనది అని అన్నారు. తెలంగాణలో వెట్టి చాకిరిని రద్దు చేయాలని, దున్నేవాడికే భూమి కావాలని, నైజాం నవాబు గద్దె దిగాలనే నినాదాలతో సాగిన మహత్తర సాయుధ పోరాటం, ప్రపంచం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినది. అందులో మల్లు స్వరాజ్యం బందుకు చేతపట్టి ముందు వరుసలోనే నిలిచి మన అందరికీ స్ఫూర్తినిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు సీపీఐ(ఎం) సర్కిల్ కమిటీ సభ్యులు మల్లెపాక వీరయ్య, ఎం.గోపి నాయక్, ఎం.కృష్ణ, సిహెచ్ మల్లేష్, సిహెచ్.నవీన్, వి.వెంకన్న, ఎల్బీనగర్ సర్కిల్ సీపీఐ(ఎం) కార్యదర్శి ఆలేటి ఎల్లయ్య, ఆర్.పాండు న్షాయక్, లక్ష్మణ్, యాకన్న శ్రీను, నరసింహ, శోభన్ పాల్గొన్నారు.