Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- రూ.13.80లక్షల నిధులతో రోడ్ల అభివృద్ధి
నవతెలంగాణ-బడంగ్పేట్
మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నానని, ఇప్పటికే కోట్లాది రూపాయల నిధులతో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టినట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అదివారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్, మీర్పేట్ కార్పొరేషన్లలో రోడ్ల నిర్మాణానికి రూ.13 కోట్ల 80 లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపి హెచ్ఎండిఎ నిధులు మంజూరు చేశారని ఆయా కార్పొరేషన్ల ప్రజల తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్కు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందులో బడంగ్పేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో మారుతినగర్ నుండి ఆల్మాస్గూడ మెయిన్ రోడ్డు వరకు రెండు కోట్లతో బీటీ రోడ్డు, గుర్రంగూడ మెయిన్ రోడ్డు నుండి అదిత్యనగర్, సాయి బాబా టెంపుల్ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.1 కోటి 50లక్షలు, బడంగ్పేట్ మెయిన్ రోడ్డు నుంచి శ్రీనిలయం కాలనీ వరకు ఒక కోటి 20లక్షలు, ఏజీఆర్ కాలనీ నుండి సుబ్రమణ్య కాలనీ వయా మౌంట్ కార్మెల్ స్కూల్ వరకు బీటీ రోడ్డు నిర్మాణా నికి ఒక కోటి 50 లక్షలు, ఆల్మాస ్గూడ సబ్ స్టేషన్ (ఎర్ర కుంట) నుండి శ్రీ హిల్స్ వయా మధుర నగర్ బీటీ రోడ్డుకు ఒక కోటి 30లక్షల నిధులు విడుదల చేయించి నట్లు తెలిపారు. అదేవిధంగా మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలో రూ.1 కోటి 20లక్షల రూపాయలతో ఆర్సీఐ రోడ్డు నుంచి వయా డిఎన్ఆర్ కాలనీ, లలిత నగర్, నందనవనం వరకు రోడ్డు వెడల్పు పనులకు 65 లక్షలతో రాఘవేంద్ర నగర్ నుంచి న్యూ గాయత్రినగర్ వరకు రోడ్డు వెడల్పు పనులకు, 60 లక్షలు అంబేెడ్కర్ విగ్రహం నుండి గాయత్రి నగర్ వరకు రోడ్డు వెడల్పు పనులకు, 85 లక్షలు ఆటో స్టాండ్, పోస్ట్ బాక్స్ నుంచి మీర్పేట్ లైబ్రరీ వరకు రోడ్డు పనులకు, జల్పల్లి మునిసిపాలిటీలో 11/0 నుండి 11/4 శ్రీశైలం హై వై (ఎన్హెచ్ 765) వయా పహాడి షరీఫ్ దర్గా రోడ్డు వెడల్పు పనులకు నిధులు మంజూరు అయ్యాయని మంత్రి తెలిపారు.