Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
టీఎన్జీవోస్ యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎస్.ఎం.హుస్సేని(ముజీబ్) ఏకైక కుమారుడు సయ్యద్ అసద్ఉద్దీన్ 24వ జన్మదినం పురస్కరించుకుని అదివారం ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో రోగుల బంధువులు 1000 మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ ముజీబ్, ఆయన కుమారుడు సయ్యద్ అసద్ఉద్దీన్, కె.ఆర్.రాజ్‌కుమార్, కుర్రాడి శ్రీనివాస్, వైదిక్ శస్త్ర, బి.శంకర్, ఎం.ఏ.ముజీబ్, ముహమ్మద్ వహీద్, ఓంప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. తన కుమారుడి జన్మదినం సందర్భంగా ఎంఎన్‌జే ఆస్పత్రిలో రోగుల బంధువులకు అన్నదానం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని, రానున్న రోజుల్లో తన కుమారుడు అన్ని రంగంలో ముందుండాలని ప్రత్యేకంగా సంక్షేమ కార్యక్ర మాల్లో తనకి చేదోడువాదోడుగా ఉండాలని డాక్టర్ ముజీబ్ కోరుకున్నారు.