Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగోల్
నాగోల్ డివిజన్లోని బండ్లగూడ చెరువును ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సందర్శించి అయ్యప్ప కాలనీ వైపున జరుగుతున్న పూడికతీత పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెరువుల్లోకి వెళ్లే మార్గంలో మట్టి పేరుకుపోయిందని, దీంతో చుట్టుపక్కల ఉన్న కాలనీలోని డ్రైనేజీలు పొంగి మురికి నీరు రోడ్లపై పొంగిపొర్లుతున్నాయని తెలిపారు. భూగర్భ డ్రైనేజీ పొంగిపొర్లిపోవడమే కాకుండా ఓపెన్ డ్రైనేజీలలోని మురికి నీరు కూడా చెరువులోకి వెళ్లడంలేదని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని ఉద్దేశంతోనే చెరువు ముందు భాగంలో పేరుకుపోయిన సీల్డ్ మట్టిని తొలగించడానికి నీటిలో పనిచేసే (నీటిలో తేలియాడే) జేసీబీ యంత్రాన్ని వినియోగిస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. డ్రైనేజీ నీరు సాఫీగా చెరువులోకి వెళ్లడానికి పేరుకుపోయిన మట్టిని తొలగించే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులతోపాటు జీహెచ్ఎంసి ఏఈ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.