Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి
నవతెలంగాణ - మీర్పేట్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీి అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. మందమల్లమ్మ చౌరస్తాలో రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మల దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగాల కోసం ఉమ్మడి రాష్ట్రంలో సరైన న్యాయం జరగడం లేదని, దశాబ్దాలపాటు యువత పోరాటం చేశారని, జీవితాలను త్యాగం చేసి ఎందరో యువకులు ప్రాణ త్యాగం చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు అని కేసీిఆర్ మాయమాటలు చెప్పి తాను చెప్పిన మాటలన్నీ గాలికి వదిలేశాడని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ పాలనలో ఉద్యోగ నియామకాలు అపహాస్యంగా పరిణమించాయని, ఉద్యోగ నియామకాల్లో అడ్డగోలు అవినీతి, డబ్బులకు ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ కాంగ్రెస్ నాయకులు చల్లా బాల్‌రెడ్డి, జిల్లా జనరల్ సెక్రెటరీ ఎరుకల వెంకటేష్ గౌడ్, మాజీ వార్డు మెంబర్ కీసర యాదగిరిరెడ్డి, గెల్లా సుభాష్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, సారిలాల్, బాలు పాల్గొన్నారు.