Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక సంఘం నాయకులు జే.పెంటయ్య
నవతెలంగాణ-బడంగ్పేట్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ కార్మిక సంఘం నిరంతరం ఎంతో కృషి చేస్తుందని కార్మిక సంఘం నాయకులు జే.పెంటయ్య అన్నారు. ఆదివారం మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపల్ పరిధిలో ఉన్న బాలాపూర్, కొత్తపేట్, పహాడి షరీఫ్ గ్రామాల పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో షాహిన్ నగర్లో ప్రత్యేక సమావేశం నిర్వహిం చారు. అనంతరం నూతనంగా మున్సిపల్ కార్మిక సంఘం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది. నూతన అధ్యక్షులుగా మస్కు బామ్మ, ఉపాధ్యక్షులు ఖాజాపాషా, ప్రధాన కార్యదర్శిగా డి. శ్రీనివాస్, సహాయ కార్యదర్శి దండు శ్రీనివాస్, కోశాధికారిగా ఎ.శ్రీదేవి, కమిటీ సభ్యులుగా భారతమ్మ, భాగ్య, స్వరూప, లక్ష్మి, గౌస్ పాషా, ఎస్.లక్ష్మమ్మ, ఎస్.రమేష్, భాగ్యమ్మ, బుజ్జి, సుమత, వినోదలను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్మికులకు ప్రత్యేక ఇవ్వవలసిన బట్టలు, చెప్పులు, బ్లౌజులు, తదితర సామాగ్రిని సమయానికి ఇచ్చే విధంగా కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు తదితరులు ఉన్నారు.