Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
మహాత్మా గాంధీ లా కళాశాలలో ప్రెషర్స్ డే వేడుకలు కళాశాల ఆవరణలో ఘనంగా జరిగాయి. న్యాయ కళాశాల విద్యార్థుల ప్రేషర్ డే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ అధ్యక్షులు నరసింహారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర పోరాటంలో న్యాయవాదుల పాత్ర మరువలేనిదని ఆయన పేర్కొన్నారు. న్యాయవాద వత్తిలో కష్టపడి పనిచేస్తే న్యాయవాదులకు మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. పేదలకు న్యాయం అందించడం సామాజిక బాధ్యతగా స్వీకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ లోకేష్ కుమార్, కళాశాల సెక్రెటరీ గంగుల గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. గంగుల గోవర్ధన్ రెడ్డి సతీమణి స్వర్గీయ గంగుల అరుణ పేరు మీద పరీక్షలో ప్రధమ శ్రేణి, ద్వితీయ, స్థానం పొందిన విద్యార్థులకు బంగారు బహుమతులను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.