Authorization
Sun March 09, 2025 06:43:46 pm
నవతెలంగాణ - ఎల్బీనగర్
రైస్ ఏటీిఎం సెంటర్ అధినేత దోసపాటి రాము సేవ శ్రేష్ఠ పురస్కారం అందుకున్నారు. రైస్ ఏటీిఎం ద్వారా గత మూడు సంవత్సరాలుగా పేదలకు ఉచితంగా దోసపాటి రాము బియ్యం పంపిణీ చేస్తున్నారు. కరోనా కష్ట కాలంలో రైలు, బస్ సౌకర్యం లేక నడుచుకుంటూ వెళుతున్న వలస కార్మికులకు భోజనం, బట్టలు, చెప్పులు అందించారు. యువ ఇంజినీర్‌గా తనకు వచ్చిన జీతం పేదలకు పంచిపెట్టి మానవత్వం చాటుకున్నారు. కరోనా సమయంలో పేదలకు ఉచితంగా కూరగాయలు పంచిపెట్టారు. ఎల్బీనగర్లో వరదలు వచ్చినప్పుడు పాలు, కూరగాయలు, బియ్యం పంపిణీ చేశారు. ఎల్బీనగర్లోని రాక్ టౌన్లో రైస్ ఏటీిఎం సెంటర్‌ను ఏర్పాటు చేసి వేలాది మంది పేదలకు ఉచితంగా బియ్యం, పంపిణీ చేశారు. నిరుద్యోగులకు బియ్యం అందించారు. మూడు సంవత్సరాల నుండి పేదలకు కుట్టు మిషన్స్, తోపుడు బండ్లు, టిఫిన్ సెంటర్స్‌కు కావలసిన పాత్రలు ఉచితంగా ఇచ్చి పేదలకు ఉపాధి కల్పించారు. విశిష్ట సేవలు అందించిన దోసపాటి రాముకు 2023 ఉగాది పురస్కారాన్ని అందించారు.
సేవా శ్రేష్టగా ప్రముఖ సామాజిక కార్యకర్త దోసపాటి రాముకు త్యాగరాయ గాన సభలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ యమునా పాఠక్ అందించారు. ఈ సందర్భంగా దోసపాటి రాము మాట్లాడుతూ ఈ సత్కారం మా బాధ్యతను మరింత పెంచుతుంది అన్నారు. రైస్ ఏటీిఎంకు సహకరించిన ప్రతి ఒక్కరికీి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా కష్ట కాలంలో నాకు ఎవరు దిక్కు అని ఎదురుచూస్తున్న వాళ్ళను ఆదుకునే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.