Authorization
Thu April 10, 2025 08:43:36 am
నవతెలంగాణ-నాగోల్
జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ పీజీ ప్రవేశ పరీక్షలో 633వ ర్యాంకును సాధించిన సూర్యాపేట జిల్లాకు చెందిన తల్లాడ సింధూజను ఆదివారం రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మెన్, ఇంటర్నేషనల్ వైశ్యఫెడరేషన్ జాతీయ కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్‌గుప్త అభినందించారు. నాగోల్ లోని శ్రీనివాసగుప్త క్యాంపు కార్యాలయంలో సింధుజను ఆమె తల్లిదండ్రులు తల్లాడ సోమయ్య, రాధాలను అభినందిస్తూ సింధుజను శాలువాలతో సన్మానించారు. ఇంకా మునుముందు మరెన్నో విజయాలు సాధించాలని శ్రీనివాస్‌గుప్త ఆమెకు సూచించారు.