Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లాలాపేట్‌లోని జయశంకర్ స్టేడియంలో మరమ్మతు పనులపై స్థానికుల అసంతృప్తి
నవతెలంగాణ-ఓయూ
సికింద్రాబాద్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు పనితీరుపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తార్నాక డివిజన్ పరిధిలోని లాలపెట్ ప్రో.జయ శంకర్ స్టేడియంలో గతేడాది వర్షాలకు నీరు లీక్ కావడంతో మర మ్మతులు చేపట్టారు. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు గతంలో లీక్ అయిన రెండు చోట్లా మళ్లీ నీరు లీక్ అవుతూ వర్షం కురవడం గమనార్హం. దీనితో పలువురు స్థానికులు, వాకర్స్ ఇది చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్టేడియం '' రూఫ్ '' మరమ్మతులు సుమారు రూ. 25 లక్షలు వెచ్చిం చి చేపట్టినా ఏడాది కాక ముందే ఇలా మళ్లీ లీక్ కావడం పని జరిగిన తీరు నాణ్యతకు అద్దం పడుతోందని వారు అంటున్నారు. మరొక వైపు ఆదివారం తెల్లవారు జామున కురిసిన వర్షానికి స్టేడియం ఒక వైపు మినీ కుంటను తలపి స్తోన్నది. ప్రజాధనం దుర్విని యోగం చేసి నాసి రకమైన మరమ్మతులు చేపట్టిన సంబం ధిత అధికారులు, గుత్తేదా రుని ఫై చర్యలు చేపట్టాలని స్థానికులు, క్రీడాకారులు, వాకర్స్ కోరుతున్నారు.