Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహనీయుల లక్ష్యాల సాధనకు పోరాడాలి
- కేేవీపీఎస్ నగర మహాసభలో రాష్ట్ర అధ్యక్షులు జాన్‌వెస్లీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి ఏప్రిల్ మాసంలో పూలే, అంబేద్కర్ జాతరలు నిర్వహించనున్నట్టు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్షులు జాన్‌వెస్లీ తెలిపారు. మహానీయుల లక్ష్యాల సాధనకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 11న మహాత్మ జోతిబాపూలే జయంతి, ఏప్రిల్ 14న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఏప్రిల్ నెల మొత్తాన్ని మహనీయుల మాసంగా ప్రకటించి ఏప్రిల్ 1-14 వరకు బైక్ యాత్రలు, ఏప్రిల్ 14-30 వరకు పూలే, అంబేడ్కర్ జాతరలను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆదివారం గోల్కొండ క్రాస్‌రోడ్‌లోని ప్రజాసంఘాల కార్యాలయంలో కేవీపీఎస్ గ్రేటర్ హైదరాబాద్ నగర 3వ మహాసభల సందర్భంగా కేవీపీఎస్ జెం డాను జాన్‌వెస్లీ ఆవిష్కరించారు. ఈ మహాసభలకు కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు టి.సుబ్బారావు, బి.అనూష, సీహెచ్.భిక్షపతిలు అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్‌వెస్లీ మాట్లాడుతూ రాజ్యాంగం, రిజర్వేషన్లు, ప్రభు త్వ రంగ సంస్థలను పరిరక్షించుకుంటామని ప్రతి ఒక్కరూ ప్రతిన బూనాలని అన్నారు. దేశంలో మూడు వేల సంవత్సరాల మనుస్మృతికి 73 ఏండ్ల భారత రాజ్యానికి మధ్య అంతర్యుద్ధం కొనసాగుతుందన్నారు. స్వాతంత్రం ఉద్యమంతో ఏ మాత్రం సంబంధంలేని, జాతీయ జెండాను వ్యతిరేకించి, భారతదేశ రాజ్యా ంగం ఈ దేశానికి పనికిరాదని ప్రకటించిన ఆర్ఎస్ఎస్ కనుస న్నల్లోని బీజేపీ నేడు కేంద్రంలో అధికారంలో ఉన్నదన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి గద్దెనెక్కిన మోడీ సర్కార్ ఆ రాజ్యాం గాన్ని పూర్తిగా రద్దు చేయడానికి కుట్రలు చేస్తుందన్నారు. లాభాలు వచ్చే పాడియావు లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా బడా కార్పొరేట్ శక్తులకు అమ్ముతున్నదని, ఇప్పటికే 16 కీలక ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసిందన్నారు. ప్రభుత్వ రంగం మొ త్తం ప్రయివేటుపరం చేయడం ద్వారా దళిత, గిరిజన, బలహీన వర్గాల రిజర్వేషన్లకు గండి కొడుతున్నదన్నారు. నూతన విద్యా విధానం ముసుగు ధరించి పక్కా మనువాద విద్యా విధానాన్ని అమలు చేస్తుందన్నారు. దీంతో పేదలకు ఉన్నత విద్యను దూరం చేస్తుందన్నారు. ప్రశ్నిస్తే దేశద్రోహం, భిన్నిస్తే భౌతిక దాడి వంటి చర్యలకు పాల్పడుతుందన్నారు. కేవీపీఎస్ గ్రేటర్ హైదరాబాద్ నగర ఉపాధ్యక్షులు ఎం.దశరధ్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ దళితులపై దాడులకు పాల్పడు తున్నవి ఆర్ఎస్ఎస్, బీజేపీ శ్రేణులేనని, రామోజీపేట, అల్మాస్ పూర్, గువ్వలేగికనిపెట్ట, పొట్టిపల్లి సింగాయపల్లి వంటి గ్రామాలలో ఆర్ఎస్ఎస్ శ్రేణులే దాడులకు పాల్పడ్డాయని విమర్శిం చారు. నేడు రాజ్యాంగం తీవ్ర సవాళ్లు ఎదుర్కొంటున్నదని, ఈ రాజ్యాంగంపై ప్రమాణం చేసిన బీజేపీ నేతలు దాన్ని రద్దు చేయడం కోసం కుట్రలు చేస్తున్నారని చెప్పారు. ఆ రాజ్యాంగంలో ఒక్కొక్క పేజీ చింపేస్తున్నారని విమర్శించారు.
20మందితో నూతన కమిటీ
మహాసభల్లో కేవీపీఎస్ గ్రేటర్ హైదరాబాద్ నూతన కమిటీని 20మందితో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా ఎం. దశరధ్, ఉపాధ్యక్షులుగా సీహెచ్.అజరు బాబు, జి.రాజు, ప్రధాన కార్యదర్శిగా టి.సుబ్బారావు, సహాయ కార్యదర్శులుగా బి.అ నూష, ఏ.శ్రీనివాస్, విష్ణుమూర్తి, కె.కపాకర్, కమిటీ సభ్యులుగా యాదయ్య, స్వప్న, నర్సిహ్మా, సత్యనారాయణ, చబద్రమౌళి, దశరథ్, సురేష్, సోమేశ్, అంజయ్య, లక్ష్మణ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.