Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే ముఠా గోపాల్
నవతెలంగాణ-హైదరాబాద్
ప్రజా సమస్యల పరిష్కారంలో బీఆర్ఎస్ నాయకులు ముందు వరుసలో ఉండాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. ఆదివారం ముషీరాబాద్ డివిజన్ పరిధిలోని వైయస్సార్ పార్క్ కాలనీలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గౌరీ శంకర్ ఆలయం చైర్మెన్ శ్రీధర్ చారి, బీఆర్ఎస్ స్థానిక ఉపాధ్యక్షులు అహ్మద్‌తో పాటు కాలనీవాసులు పి శ్రీధర్ గౌడ్, ప్రేమలతా రెడ్డిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసి సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో సఫలమె ౖనప్పుడే ప్రజాదరణ లభిస్తుందన్నారు. ఆత్మీయ సమ్మేళనం ద్వారా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారికి అన్ని విధాలుగా అండగా ఉండాలని సూచించారు. నియోజక వర్గం లో వాడవాడల సమ్మేళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకులు ముఠా జై సింహ, మాజీ రాష్ట్ర కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్, మాజీ కార్పొరేటర్ నూట పద్మ నరేష్, డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ శ్రీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు శివ ముదిరాజ్, లక్ష్మణ్ గౌడ్, రజిని గోరఖ్‌నాథ్, డివిజన్ మాజీ అధ్యక్షులు బిక్షపతి యాదవ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు సదా శంకర్ ముదిరాజ్ పాల్గొన్నారు.