Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఛీవర్స్ క్యాంపస్‌లో శిక్షణ పొంది విజయం సాధించిన విద్యార్థులు
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
నగరంలోని డా. భాటియా మెడికల్ కోచింగ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన అఛీవర్స్ క్యాంపస్ నుంచి 600 పైగా రాంకులతో విద్యార్థులు మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లను సాధించారు. ఈ సందర్భంగా అఛీవర్స్ క్యాంపస్ (తెలంగాణ, ఆంధప్రద్రేశ్) డైరెక్టర్స్ డాక్టర్ సాయి ఇంద్రసేన, డాక్టర్ సురేంద్రనాథ్ రెడ్డిలు మాట్లాడుతూ.. ఎంతో మంది విద్యార్థులను ర్యాంకర్లుగా తీర్చిదిద్ది వారి మద్దతుతో భారతదేశంలోనే అత్యుత్తమ క్యాంపస్‌గా నిలిచింది అఛీవర్స్ అన్నారు. ఈ క్యాంపస్ ద్వారా విద్యార్థులు ఏకాగత్రతో చదువుకోవడానికి రీడింగ్ రూమ్‌లు, ఫైనల్ ఎగ్జామ్‌లో ఎలాంటి పరీక్ష భయం లేకుండా ఉండడానికి ఆన్ లైన్ ఎగ్జామినేషన్ ల్యాబ్‌లను వారికి అందుబాటులో ఉంచామన్నారు. విద్యార్థుల సందేహాలకు ఎప్పటికప్పుడు ఫ్యాకల్టీ సంభాషించడం, రెగ్యులర్ మెంటార్ షిప్ అందించడం ద్వారా వారిలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందన్నారు. విద్యార్థుల పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ వారిని తమ కుటుంబంగా భావించి ప్రతీ విషయంలోనూ వారికి కోచింగ్ ద్వారా మద్దతు అందిస్తున్నామన్నారు. ఇక నీట్ పీజీ వచ్చాక 50 శాతం (ఆల్ ఇండియా కోటా) కోటాలో దేశ వ్యాప్తంగా ఏ రాష్టంలోనైనా సీటు సాధించే అవకాశం ఉందన్నారు. ఈ అచీవర్స్ క్యాంపస్ గురించి అతి ముఖ్య మైన విషయం ఏమిటంటే తెలుగు రాష్ట్రాల విద్యార్థుల అత్యుత్తమ ప్రతిభ కారణంగా వారు జాతీయ కోటా లో ఎక్కువ సీట్లను సాధిస్తు న్నారని తెలిపారు. ఈ ఫలితంతో దేశవ్యాప్తంగా ఈ క్యాంపస్ అందరి దష్టిని ఆకర్షిస్తోం దన్నా రు. హైదరాబాద్‌లోని అచీవర్స్ క్యాంపస్ కోసం భారతదేశం నలుమూలల నుంచి అనేక మంది విద్యా ర్థులు హైదరాబాద్ కు వస్తున్నారని తెలిపారు.