Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్థలంలో బోర్డు ఏర్పాటు చేస్తున్న పాలకమండలి
- చైర్మెన్ ఈశ్వరమ్మ యాదవ్, ఈఓ శ్రీనివాసశర్మ
- గుడెసెలు తొలగించి స్వాధీనం
నవతెలంగాణ-సంతోష్‌నగర్
ముప్పై ఏళ్లుగా అన్యాక్రాంతమైంది. కోర్టు ఉత్తర్వులతో రూ.20కోట్ల విలువైన స్వామివారి స్థలానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. చంపాపేట డివిజన్ పరిధి కర్మన్‌ఘాట్‌లోని ధ్యానాంజనేయ స్వామి ఆలయానికి చెందిన సర్వే నంబర్ 150లో 15 గుంటల భూమిని కొందరు ఆక్రమించారు. దీంతో ఆలయ పాలకమండలి న్యాయపోరాటం చేసి ఎట్టకేలకు విజయం సాధించింది. కోర్టు ఇటీవల తీర్పు వెల్లడించింది. ధ్యానాంజనేయ ఆలయ పాలకమండలి చైర్మెన్ పోచబోయిన ఈశ్వరమ్మయాదవ్, ఈఓ శ్రీనివాసశర్మ న్యాయస్థానం ఉత్తర్వుల ప్రకారం సోమవారం ఉదయం కందుకూరు ఆర్టీఓ సూరజ్‌కుమార్, సరూర్‌నగర్ తహసీల్దార్ జయశ్రీ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తుతో ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ, ఎల్బీనగర్, వనస్థలిపురం ఏసీపీలు శ్రీధర్రెడ్డ్డి, పురుషోత్తం రెడ్డి, సరూర్‌నగర్ సీఐ జానకీరాంరెడ్డి, ఫైర్ అధికారులు, విద్యుత్, ఆరోగ్యశాఖ అధికారులతో పాటు దాదాపు వందమంది పోలీసులు అక్కడకు చేరుకున్నారు. స్వాధీనం చేసుకున్న స్థలంలో ఆలయ సిబ్బంది బోర్డు ఏర్పాటు చేశారు. భోజనశాల లేదా ఇతర మౌలిక సదు పాయాలకు ఉపయోగించాలనే ఆలోచన ఉన్నట్లు పాలకమండలి ప్రతినిధులు తెలిపారు. త్వరలోనే స్థలం చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఆలయ స్థలానికి 30ఏళ్లకు మోక్షం లభించడంతో పాలకమండలి ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. స్థలం స్వాధీనానికి సహకరించిన ఆయా శాఖల అధికారులకు వారు కతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాలకమండలి ధర్మకర్తలు మొరిశెట్టి శ్రీనివాసగుప్తా, చెగోని మల్లేష్‌గౌడ్, యాదిరెడ్డి, అఖిలామధుసాగర్, అనిత, రెడ్డి, సర్రె శ్రీనివాస్ పాల్గొన్నారు.
పునరావాసం చూపించాలి
ఎన్నో ఏళ్ళుగా ఈ స్థలంలో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నామని.. తమను ఆదుకోవాలని పలువురు నిరుపేదలు సోమవారం ఉదయం ఆర్డీవోను వేడుకున్నారు. ఎక్కడైనా పునరావాసం కల్పించాలని వారు కోరారు.
ఉన్నతాధికారులతో చర్చించి చర్యలు చేపడతామని ఆర్జీఓ వారికి హామీ ఇచ్చారు.