Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే కేసు నమోదు
- ఇది ముమ్మాటికీ నియంతత్వ విధానమే
- టీ.పీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్
నవతెలంగాణ-బోడుప్పల్
క్యూ న్యూస్ నిర్వాహకుడు తీన్మార్ మల్లన్నతో క్యూ న్యూస్ ఉద్యోగులు నలుగురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు బుధవారం నాడు మేజిస్ట్రేటు ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం నాడు సాయంత్రం సమయంలో పీర్జాదిగూడ రాఘవేంద్రనగర్‌లో వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న పోలీసులను బలవంతంగా క్యూ న్యూస్ కార్యాలయంలోకి తీసుకువెళ్ళి నిర్బంధించారనే అంశంపై ఫిర్యాదు రావడంతో క్యూ న్యూస్ నిర్వాహకుడు తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) నలుగురు క్యూ న్యూస్‌లో పనిచేసే బండారు రవీందర్, ఉప్పల నిఖిల్, సిర్రా సుధాకర్, చింత సందీప్ కుమార్లపై 363, 432, 395, 332, 307, రెడ్ విత్ 34 ఐపీసీ,సెక్షన్ 7(1) నేర సవరణ చట్టం 1932 ప్రకారం కేసులు నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు. ముమ్మాటికీ నియంతత్వ ధోరణే-తెలంగాణ రాష్ట్రంలో సర్కారు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు తనదైన శైలిలో ప్రశ్నిస్తున్న తీన్మార్ మల్లన్నపై తప్పుడు కేసులలో ఇరికించి అరెస్టు చేయడం నియంతత్వ ధోరణేనని టీ.పీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్ అన్నారు. మల్లన్న అరెస్టు విషయం తెలుసుకున్న ఆయన కాంగ్రెస్ నేతలతో పాటు మల్లన్న నివాసానికి వెళ్ళి సంఘీభావం తెలిపారు. మల్లన్న కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన హమీ ఇచ్చారు.