Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ నాయకత్వంలో పేద ప్రజల సంక్షేమానికి, సుస్తీ నయం చేయటానికే బస్తీ దవఖానాలు ఏర్పాటు చేయటం జరిగిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో వైద్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో ప్రతి 10 వేల జనాభాకు ఒక బస్తీ దవాఖాన, 50వేల జనాభాకు ఒక అర్బన్ పీిహెచ్సి ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని, పేద ప్రజల చెంతకు వైద్యం తీసుకెళ్లటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆరోగ్య తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కషి చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలో 73 బస్తీ దవాఖానాలు మంజూరు కాగా, అందులో ఇప్పటికే 57 ప్రారంభం అయ్యాయని, మిగతావి కూడా త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా 27 యూపీహెచ్సీలు కూడా మంజూరు అయ్యాయన్నారు.
ఈనెల 24న సీపీిఆర్పై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు, బస్తీ దవాఖాన ప్రోగ్రాం ఇన్చార్జ్ వినోద్, జిల్లా ట్రైనింగ్ అధికారి అనిత తదితులున్నారు పాల్గొన్నారు.