Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్మేటి అమరేందర్ రెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
కేంద్రంలో, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే అభివృద్ధి సాధ్యం మవుతుందని టీపీసీసీ కార్యదర్శి ఎల్మేటి అమరేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మహేశ్వరం నియోజక వర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న బాలాజీ నగర్ నుండి సుమారుగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, మహిళలు, యువకులు కలిసి కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై అమరేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతి అక్రమాలకు పాల్పడి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి అధికారంలోకి తీసుకు రావటానికి సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో జల్పల్లి మున్సిపాలిటీ మైనారిటీ సెల్ చైర్మెన్ అహ్మద్ బామ్, నాయకులు వంగేటి మధుసూదన్ రెడ్డి, ఆంజనేయులు, సాయిగౌడ్, చారి, బల్వంత్ నాయక్, జగదీష్ నాయక్, చందు నాయక్, నాని నాయక్, దేశీ నాయక్, అంబాలిక నాయక్, మరియు మంజుల నాయక్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.