Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరీక్షల సమయంలో పిల్లలకు డైట్ ఫుడ్
నవతెలంగాణ-హయత్‌నగర్
తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ నుంచి జరగనున్నాయి. చాలా మంది పిల్లలు సరైన ప్రణాళికలు వేసుకోక చివరి నిమిషంలో ఏదిపడితే అది చదివేస్తుంటారు. చివరి రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కొన్ని సూచనలు, సలహాలు తెలుసుకుందాం.
మైండ్ మ్యాపింగ్
విజువల్ లెర్నింగ్ పద్ధతిలో మైండ్ మ్యాపింగ్ ఒకటి. ఈ పద్ధతిలో చదివింది చాలా సులభంగా గుర్తుండే అవకాశం ఉంటుంది. పరీక్షలు రాసే వారు ఏ అంశాన్ని అయినా సరే విజువల్ రూపంలో గుర్తుకు తెచ్చుకుంటే చాలా రోజులు గుర్తుకు ఉంటుంది.
ఫేన్మాన్ టెక్నిక్ : ఫేన్మాన్ టెక్నిక్‌ని పాటించి చాలా మంది సక్సెస్ అవుతున్నారు. సింపుల్‌గా చెప్పాలి అంటే మొదటగా చాప్టర్స్‌ను విడగొట్టాలి. మనకు అర్ధం కాని వాటిని గుర్తించాలి. వాటిని అర్ధం చేసుకునేలా ప్రిపేర్ అవ్వడమే ఫేన్మాన్ టెక్నిక్.
పరీక్షల సమయంలో డైట్ ఫుడ్ తినాలి
విద్యా సంవత్సరం ముగుస్తుండడంతో ఈ సమయంలో విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. పిల్లలు పరీక్షల కోసం ఎంత చదివినా, ఎంత శ్రమించినా ఆరోగ్యం సహకరించకపోతే ఏడాదంతా వధా అవుతుంది. అంతే కాదు ఎండ తీవ్రత కూడా ఈ సమయంలో ఎక్కువగా ఉంటుంది. ఇంట్లోనే కూర్చొని ఎక్కువగా చదువుతుంటారు. మంచి పోషకాహారం పిల్లలకు ఇవ్వాలి. బ్రెయిన్ దానికి అందే గ్లూకోస్, రక్త ప్రసరణపై ఆధారపడి పనిచేస్తుంది. ఎక్కువగా ఆహారం తీసుకున్నా, అసలు ఆహారం తీసుకోకపోయినా మెదడు పని మీద ప్రభావం చూపుతుంది. పిల్లలు ఉన్న బరువు, ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్ టైంను బట్టి వారికి ఆహారం ప్లాన్ చేసుకుని అందించాలి. లేదంటే రెండు, మూడు వారాల్లో అధిక బరువు పెరుగుతారని న్యూట్రీషన్స్ చెబుతున్నారు. విటమిన్లు, మినరల్స్ అన్నీ అందేటట్లు ఆకు కూరలు, కూరగాయలు, పండ్లు సహజ సిద్ధమైన వాటిని ఎక్కువగా ఇవ్వాలి. పిల్లలు వేపుళ్ళకు దూరంగా ఉండాలి. ఒకేసారి ఆహారం ఎక్కువగా తీసుకోకుండా కొంచెం, కొంచెం సమయానికి తినాలి. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండి, ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలు తినాలి. ఈ సమయంలో జ్ఞాపకశక్తి పెంపొందించే ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే పదార్థాలు తినాలి. ఆరంజ్, ద్రాక్ష, అరటి, యాపిల్ పండ్లు తినడం వల్ల పరీక్షల సమయంలో వుండే ఒత్తిడిని నివారించవచ్చు. అదే పనిగా చదవకుండా ప్రతి గంటకు 10 నిమిషాలు విరామం పరీక్ష కేంద్రాలు ఎక్కువ దూరం ఉంటే డీ హైడ్రేషన్ కాకుండా వాటర్ బాటిల్, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగి వెళ్ళాలి. పరీక్ష కేంద్రంలో కి వెళ్ళే ముందు కొద్దిగా స్నాక్స్ తినాలి.
ఉదయం : ఉదయాన్నే ఒక గ్లాస్ పాలతో డైట్ ప్రారంభించాలి. ఉదయం 8గంటలకే బ్రేక్ ఫాస్ట్ తినాలి. ఎక్కువగా ఆయిల్ లేకుండా చపాతీ, పెసరట్టు, గింజలు, మిల్లెట్స్, జావ వంటివి తీసుకోవాలి. తర్వాత11గంటలకు పండ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు పిల్లలకు అందించాలి.
మధ్యాహ్నం : మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భోజనాన్ని పూర్తి చేయాలి. ఇందులో సలాడ్స్, రోటీ, కొంచం అన్నం, వెజిటబుల్స్, కర్రీ, మిల్మేకర్, సొయా, మాంసం తీసుకున్నప్పుడు ప్రత్యేకంగా పప్పు అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. సాయంత్రం 3,4గంటలకు స్నాక్స్ తినాలి.
రాత్రి : రాత్రి వేళల్లో సాధ్యమైనంత వరకు రైస్ తీసుకోకుండా చపాతీతో కాయగూరలు తీసుకోవాలి. రాత్రి భోజనంలో పాలు, గుడ్లు చీజ్‌ను భాగంగా చేసుకోవాలి. మధ్యా హ్నంతో పోల్చుకుంటే రాత్రి తక్కువగా తినాలి.