Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీ.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందించిన సమాఖ్య సలహాదారు
నవతెలంగాణ-బోడుప్పల్
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వక్ఫ్ బోర్డు స్థలాల పేరిట ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించడానికి టీ.పీసీసీ చీఫ్‌గా, స్థానిక పార్లమెంటు సభ్యుడిగా చొరవ చూపాలని సమాఖ్య ముఖ్య సలహా దారు కల్కూరి రాములు కోరారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసంలో కలిసి సమస్య కు సంబంధించిన అంశంపై వివరించి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ వక్ప్ బోర్డు భూ బాధితులు తమ సమస్య పరిష్కారం కోసం వివిధ రూపాలలో అనేక రోజులుగా ఆందోళనలు చేస్తున్న విషయాన్ని రేవంత్‌రెడ్డి దష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. గత నాలుగు సంవత్సరాలుగా మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో 350 ఎకరాలలోఎలాంటి క్రయవిక్రయాలు జరుగకుండా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయాని, దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ సమస్యను స్థానిక పార్లమెంటు సభ్యులుగా చొరవ చూపి సీఎం కేసీఆర్, సంబంధిత అధికారులకు లేఖ రాయాలని కోరారు. దీనిపై ఎంపి రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. వెంటనే సీఎం కేసీఆర్, సంబంధిత అధికారులకు తాను పార్లమెంటు సభ్యునిగా లెటర్ రాస్తున్నాని చెప్పారు.