Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వినాయక్‌నగర్, నేరేడ్ మెట్ పరిధిలో పేరుకుపోతున్న చెత్త
- భరించలేని దుర్గంధం
- మూగజీవాలకు ఆవాసంగా మారిన వైనం
- డస్ట్ బిన్లు సరిగ్గా ఏర్పాటు చేయాలని వినతి
నవతెలంగాణ-నేరేడ్ మెట్
వినాయక్‌నగర్, నేరేడ్మెట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రధాన రహదారిపై గత కొద్దిరోజులుగా చెత్త కుప్పలు కుప్పలుగా పేరుకుపోతుంది. ఇండ్లలోని చెత్త చెదారం తెచ్చి రోడ్లపై పారబో స్తుండటంతో ప్రధాన రహదారులు అపరిశుభ్రంగా దర్శనమి స్తున్నాయి. కంపు కొడుతోంది. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల డస్ట్ బిన్స్ సరిగ్గా ఏర్పాటు చేయకపోవడంతో స్ధానికులు, వ్యాపా రులు చెత్తను రోడ్లు పై పారబోసి వెళ్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు పరిసరాల పరిశుభ్రతతో తమకు ఏ మాత్రం సంబంధం లేన్నట్లు వ్యవహరిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి.
మల్కాజిగిరి నుంచి నేరేడ్మెట్ వరకూ ప్రధాన రహదారులలో సమీప కాలనీల వాసులు తమ ఇండ్లలోని చెత్త చెదారంతో పాటు మిగిలి పోయిన ఆహార పదార్థాలు పార వేయ డంతో అవి మురిగిపోయి దుర్వాసన వెదజల్లు తోందని పలు వురు వాపోతున్నారు. చెత్తతోపాటు మిగిలి పోయిన ఆహార పదార్థాలను పారవేయ డంతో ఆవులు, కుక్కలు, పందులు చేరి వాటిని తింటు న్నాయని.. ఆకలి తట్టుకోలేక ప్లాస్టిక్ కవర్లు కూడా ఆరగిస్తున్నాయన్నారు. చెత్తను రోడ్డంతా చెల్లాచెదురు చేస్తున్నా యని తెలిపారు. అసలే ఈ మధ్యన ఒక వైపు వర్షాలు కురుస్తుం డడంతో ఈ చెత్త కుప్పల్లో నీరు నిలిచి ఈగలు, దోమల వద్ధి చెందుతున్నాయని స్ధానికులు వాపోతున్నారు. తమ పనులు కోసం ఈ రోడ్డు మార్గం గుండా అటు అధికారులు, ఇటు ప్రజాప్రతి నిధులు రాకపోకలు సాగిస్తున్నా ఇంత వరకూ ఈ సమస్యను పట్టించుకున్నవారే లేరని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతి నిధులు ఈ చెత్త కుప్పలపై దష్టిసారించి తగు చర్యలు తీసుకో వాలని కోరుతున్నారు. డస్ట్ బిన్ లు ఏర్పాటు చేసి , వాటి చుట్టూ కంచెలు ఏర్పాటు చేసి మూగజీవాలు చేరకుండా, అవి ప్లాస్టిక్ కవర్లు తిన కుండా వాటి ఆరోగ్యాలను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.