Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈసీఐఎల్‌లో మాటా పాట కవితలతో కార్యక్రమం
నవతెలంగాణ-కాప్రా
తెలంగాణ ప్రజా సాంస్కతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో తెలుగువారి నూతన సంవత్సరం ఆరంభం ఉగాది సందర్భంగా ''పంచాంగం శ్రవణం కన్నా రాజ్యాంగ పఠనం మిన్న''కార్యక్రమం మాటా పాట కవితలతో ఈసీఐఎల్‌లోని కమలానగర్ ఆఫీసులో జరిగింది. కార్యక్రమానికి సామాజిక ఉద్యమ నాయకులు ప్రసాద్ బాబు అధ్యక్షత వహించారు. ముందుగా సమాచార హక్కు సాధన కమిటీ నాయకులు గగన్ కుమార్ ఆహ్వానితులను వేదిక మీదికి ఆహ్వానిం చారు. ప్రారంభ గీతంగా దేశభక్తి గీతాన్ని స్ఫూర్తి గ్రూప్ నాయకులు రుక్కయ్య ఆలపిం చారు. అధ్యక్షులు ప్రసాద్ బాబు మాట్లాడుతూ ప్రజలను చీలిక తీసుకువస్తున్న మతవాదాన్ని అనుసరించే పంచాం గం ప్రజలను అనేక మభ్యలు పెడుతున్నదని.. దాని స్థానంలో భారత రాజ్యాం గం పఠనం ఎంతో అవసరమని చెప్పారు. ముఖ్య వక్తగా విచ్చేసిన ప్రముఖ రచయిత్రి పీి జ్యోతి మాట్లాడుతూ దేవునిపై నమ్మకం వ్యక్తిగతమని, దాని పేరు మీద జాత కాలు పంచాంగాలు వివిధ రూపాలలో ప్రజలను అనేక రకాలుగా మూఢనమ్మకాల్లోకి తీసుకు వెళ్తున్నారని తెలి పారు. విద్యార్థుల్లో కూడా స్వాతంత్ర దినోత్సవానికి రిపబ్లిక్ దినోత్సవానికి తేడా తెలియని స్థితి ఉందని దాన్ని మార్చ వలసిన అవసరం ఉందని చెప్పారు. ప్రజల్లో మూఢన మ్మకాలు పెంచి పోషిస్తున్న స్వాములు, పూజారులు అనేక రకాలుగా భయభ్రాంతులకు గురిచేసి మానసిక వైకల్యానికి కారణమవుతున్నారని చెప్పారు. నేడు యువత పబ్బుల్లో నాగరిక డ్రెస్సులో వచ్చినప్పటికీ కాళ్లకు నల్లటి దారాలు కట్టుకొని నత్యాలు చేస్తున్నారని, పాత నమ్మకాలైన దిష్టి దోష మని, మరోపక్క నవ నాగరికం వ్యవహారాలు నడుపుతు న్నారని ఇది మరో రకమైన మూఢత్వానికి తీసుకు వెళుతున్నారని చెప్పారు. తర్వాత కార్యక్రమం మాట పాట కవి త్వం కార్యక్రమాన్ని స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరి రావు నిర్వహించారు. ముందుగా ప్రముఖ కవి ఆచార్యులు తమ కవితలు చదివి వినిపించారు.ఎంటాక్ మీడియా వ్యవస్థాపకులు సీహెచ్ నాగేశ్వరావు రాజ్యాంగ నిర్మాత బి.ఆర్ అంబేద్కర్‌ను, జై భీమ్ నినాదాన్ని ఉటం కిస్తూ హిందీలో చక్కని పాట పాడారు. జానపద కళాకారుల నాయకులు భాస్కర్ కవిత పాట పాడారు. ప్రముఖ కళాకారులు సోమయ్య , నారాయణ శర్మ పౌరాణిక నాటకా లలోని పద్యాలు పాడి వినిపించారు. ప్రముఖ విద్యావేత్త మల్లేష్ మూఢనమ్మకాలను త్యజించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. రాజ్యాంగంలో పొందుపరిచిన సమాన అవకాశ ాలపై, సైంటిఫిక్ టెంపర్ ప్రచారం చేయవలసిన అవస రాన్ని అందరికీ వివరించారు. చిన్నారులు మౌనశ్రీ, సహస్ర,తమ చిన్ని గళంతో చక్కని పాటలు పాడారు. శ్రీ మున్నయ్య పద్యం వినిపించారు. చల్లా లీలావతి దేవుల పల్లి కృష్ణశాస్త్రి రాసిన పాటను పాడి వినిపించారు. ప్రముఖ సామాజిక ఉద్యమ నాయకులు నర్సింగ్ రావు గోరేటి వెంకన్న పాటను పాడి వినిపించారు. ఐలన్న కవితను చదివి వినిపించారు.గొడుగు యాదగిరిరావు తన కవితలు చదివగా ప్రజాతంత్ర ఉద్యమ నాయకులు కోమటి రవి మాట్లాడారు. రాజ్యాంగ పీఠికను ప్రతిజ్ఞగా అందరితో చేయించారు. స్ఫూర్తి గ్రూప్ నాయకుల భాషా వందన సమర్పణతో సభ ముగిసింది. శారద ఉగాది పచ్చడి అంద రికీ అందించి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్ర మంలో శ్రీమన్నారాయణ వెంకట్ వెంకటేశ్వరరావు, ప్రభాకర్, శ్రీనివాసరావు, ప్రసాద్, బీడీఎల్ నాయకులు విజరు కుమార్ , శ్రీనివాస్, ఎన్ శ్రీనివాస్, ఉన్నికష్ణన్ సమ్మయ్య, కొండయ్య, రాఘవరావు, వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.