Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి
- జేవీవీ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ
నవతెలంగాణ-కాప్రా
సహజ పానీయాలు ఆరోగ్యానికి మంచిదని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి అన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా కూల్ డ్రింక్స్ వద్దు, సహజ పానీయాలు ముద్దు అని నినాదంతో ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమాన్ని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, కుషాయిగూడ ట్రాఫిక్ ఎస్ఐ నాగేంద్రప్రసాద్, జేవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. నేటి యువతరం కూల్ డ్రింక్స్ అలవాటు పడి అనారోగ్యానికి గురై అవుతున్నార న్నారు. ఈ నేపథ్యంలో పానకం, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు సహజ పానీయాలు తాగుదామని.. కూల్ డ్రింక్స్ మానే ద్దామని జనవిజ్ఞాన వేదిక ప్రచారంలో భాగంగా ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం అన్నారు. కుషాయిగూడ ట్రాఫిక్ ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. జేవీవీ వారు కరపత్రం ద్వారా ప్రచారం నిర్వహిస్తూ, ఉగాది పచ్చడి పంపిణీ నిర్వహించడం అభినం దనీయమన్నారు. మనము ఏమి చేయాలన్నా ఆరోగ్యంగా ఉండటం ప్రధానమన్నారు. నాకు ఇప్పటివరకు కూల్ డ్రింక్స్ అలవాట్లేదని తెలిపారు. ఆరోగ్యంగా ఉండాలంటే కూల్ డ్రింక్స్ మానేద్దాం, సహజ పానీయాలు తాగుదాం అన్నారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.శ్రీనివాస్ మాట్లా డుతూ ఎండాకాలం వచ్చిందంటే ఎండ తీవ్రతకు చాలా మంది ప్రజలు కూల్ డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతారని.. కూల్ డ్రింక్స్ వల్ల చాలామంది అనారోగ్య పాలవుతున్నారని తెలిపారు.మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు మాట్లా డుతూ.. ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమంలో పాల్గొని సహజ పానీయాలు తాగుదాం అనే ప్రచారంలో పాల్గొన్న ముఖ్య అతిథులు, జనవిజ్ఞాన వేదిక నాయకులు, కార్యక ర్తలు, ప్రతీ ఒక్కరికి ధన్య వాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ దాస్, దుర్గాచారి, నరసింహారావు, శేషు, సోమయ్యచారి, శ్రవణ్, జి.కె.రెడ్డి, వెంకయ్య, ప్రభాకర్, శివ శంకర్ రెడ్డి, శివప్రసాద్, రామ్ మోహన్ రావు, పరమేశ్వర్, నాగేశ్వరరావు, బసవ పునయ్య, వెంకట్, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.