Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్
నవతెలంగాణ-జవహర్ నగర్
భినత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పే భారతీయ సంస్కృతికి ఉగాది ప్రతీక అని మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్ అన్నారు. బుధవారం జవహర్ నగర్ కార్పొరేషన్‌లోని బీరప్ప దేవాలయంలో అధ్యక్షుడు మండల సురేందర్ కురుమ ఆధ్వ ర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ కాలాన్ని గౌరవించడం, ప్రకతిని పరిరక్షించడమే ఉగాది సందేశమని తెలిపారు. ఉగాదితోనే తెలుగు వారికి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నారు. షడ్రు చుల పచ్చడి, ఆయాకాలాల్లో వచ్చే అనారోగ్యాలను హరిం చడంతో పాటు గొప్ప వ్యక్తిత్వ వికాస పాఠాన్ని సందేశంగా ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి మేయర్, కార్పొరేటర్లు లావణ్య సతీష్ గౌడ్, నిహారికగౌడ్, వేణు, లలితాయాదవ్, ఎస్సైలు అనిల్ కుమార్, నాగ రాజ్ గౌడ్,అనిల్ రెడ్డి, కాంగ్రెస్ స్థానిక అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, పూడురు చందర్, నర్సింహాయాదవ్, సాధిక్, రమేషాచారి, అశోక్ గుప్తా, ముదిరాజ్ మహాసభ యూత్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ ముదిరాజ్, ప్రజా గాయకుడు వెంకటచారి, మాజీ ఎంపీటీసీ రషీదాబేగం, కురుమ సంఘం నాయకులు ప్రవీణ్, చంద్రయ్య, బిక్షపతి, ఎల్లయ్య, నర్సింహా, మీనయ్య, ఐలయ్య, వెంకటేష్, రవీందర్, నవీన్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.