Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాచారం
నాచారం డివిజన్ పరిధిలోని నల్ల పోచమ్మ దేవస్థానం ఆలయ కమిటీ ప్రతినిధులుఉగాది శుభకృత్ నామ పురస్కరించుకొని జీహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యురాలు కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్‌ను కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుభకత నామ తెలుగు సంవత్సరం ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని కోరారు. ఆలయ నూతన కమిటీ ఈనెల 26న ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలిపి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో ఆదిలక్ష్మి, చంద్రశేఖర్, ఉమామహేశ్వర చారి, శ్రీనివాస్ నాయక్, ప్రభాకర్, శ్రీధర్, రాములు, సురేందర్ స్వామి, దత్తన్న, కాళిదాసు, తదితరులు పాల్గొన్నారు.