Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేవీవీ రాష్ట్ర కోశాధికారి ఆర్ వర ప్రసాద్
నవతెలంగాణ-దుండిగల్
కూల్ డ్రింక్స్ ఎంతో నష్టం కలిగిస్తాయని వాటికి బదులుగా సహజ సిద్ధమైన కొబ్బరి నీళ్లు, మజ్జిగ, పండ్ల రసాలు, చెరుకు రసం, నిమ్మ రసం ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తాయని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కోశాధికారి ఆర్ వర ప్రసాద్ తెలిపారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరే షన్ ప్రగతి నగర్లో బుధవారం జన విజ్ఞాన వేదిక మేడ్చల్ జిల్లా బాచుపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో జేవీవీ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లయ్య చారి అధ్యక్షతన ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమా నికి జేవీవీ రాష్ట్ర కోశాధికారి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శీతల పానీయాలను సినీ నటులు ప్రోత్సహిస్తున్నారని తెలిపా రు.వారి స్వలాభం కోసం చేసే వాణిజ్య ప్రకటనలు ప్రజల ఆరోగ్యాన్ని నష్టపరిచేవిగా ఉన్నాయని జేవీవీ తీవ్రంగా గతం నుంచి వ్యతిరేకించిందని అన్నారు. వాటికి ప్రత్న్యాయంగా అందరూ సహజపానీయాల పై దష్టి సారించాలని కోరారు. సహజపానీయ ఉత్పత్తులు ప్రోత్సహించడం వల్ల వ్యవసాయరంగాన్ని, రైతులను ప్రోత్సహించినట్టవుతుందని, ప్రజల ఆరోగ్యాలకు నష్టం జరుగదని తెలిపారు. పచ్చడి పంపిణీ కార్యక్రమంలో 180 మంది ప్రజలు పాల్గొన్నారు. ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అనం తరం అనంతరం కూల్ డ్రింక్స్ మానేద్దాం సహజ పానీ యాలు తాగుదాం అనే కర పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెవీవీ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లయ్య చారి, బాచుపల్లి మండల ప్రధాన కార్యదర్శి కె. శంకర్ రావు జెవీవీ నాయకులు సైంటిస్ట్, డాక్టర్ ప్రశాంత్, మునికష్ణ, క్రిష్ణశ్రీ, క్రిష్ణయ్య, నరేష్, అఖిల్, రాజ్ కుమార్, శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.