Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించేం దుకు ప్రభుత్వం బుధవారం నుంచి సందర్శకులకు అనుమతి ఇవ్వడంతో అందుకునుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాట్లు చేసినట్టు సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ సీహెచ్ వెంకన్న బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం రాష్ట్రపతి నిలయం సందర్శనకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అనుమతి ఇవ్వడంతో సందర్శకులు సౌకర్యార్థం ప్రతీ 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలో సికింద్రాబాద్ నుంచి బాలాజీనగర్, సీఆర్పీఎఫ్, ఘట్కేసర్కు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం మీదుగా బస్సులను నడపను న్నట్టు ఆయన పేర్కొన్నారు. కంటోన్మెం ట్ డిపోకు చెందిన బస్సు రూట్ నెం.24బి, సికింద్రాబాద్ నుంచి బాలాజీ నగర్, అదేవిధంగా హకీంపేట డిపో నుంచి రూట్ 211ఎమ్ సికింద్రాబాద్ నుంచి సీఆర్పీఎఫ్, 24బి/281 సికిం ద్రాబాద్ నుంచి ఘట్కేసర్కు ప్రతిరోజు 187 ట్రిప్పులతో ప్రతి 5నుంచి 10 నిమిషాలకు బస్సులు అందు బాటులో ఉంటా యన్నారు. ఈ సౌకర్యాన్ని ప్రయా ణికులు సద్వినియో గం చేసుకోవాలన్నారు. సురక్షిత, సుఖవంతమైన ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సంస్థ అభివృద్ధికి సహకరించాలని ఆర్.ఎం వెంకన్న విజ్ఞప్తి చేశారు.