Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్ నగర్
ప్రపంచ ప్రమాణాలతో ఆయుర్వేద జీవన అవకాశం కల్పిస్తున్న ఆండాలు ఆయుర్వేదిక్ ఆశ్రమమని ఆండాలు ఆయుర్వేదిక్ ఆశ్రమం ఎండీ ఎస్ఎంఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్, చైర్మన్ మంజుల జూపల్లి అన్నారు. ప్రకాశవంతమైన జీవనయోగానికి శ్రీకారం, ప్రకృతితో మమేకమైన, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అవలం భించేందుకు అతి సులువైన మార్గం ఆండాలు ఆయుర్వే దిక్ ఆశ్రమం అని ఆమె పేర్కొన్నారు. బుధవారం ఉగాదిని పురస్కరించుకుని కంట్రీ క్లబ్ లో ఆండాలు ఆయుర్వేదిక్ ఆశ్రమా బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రకృతితో మమేకమౌ తూ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆయుర్వేద సేవలు అందించే ఇకో రియాలిటీ వెంచర్ అన్నారు. హెల్త్ టూరిజం కోసం ప్రపంచమే భారతదేశం వైపు చూస్తున్న తరుణంలో ఆండాలు ఆయుర్వేదిక్ ఆశ్రమం వెల్ నెస్ ఒక గ్లోబల్ స్పటాలిటీ కేంద్రంగా ఎదగనుందని ఆమె పేర్కొన్నారు. మారిన జీవనశైలి తెచ్చే వేలాది సమస్యలకు భారతీయ ఆయుర్వేదం పరిష్కారాన్ని చూపిస్తుందనీ, అలాంటి ఆయుర్వేదానికి తెలంగాణాలో మొట్టమొదటి ఆరోగ్య క్షేత్రమన్నారు. దృష్టి విలువలను అంతర్గతంగా ప్రేరేపించే ప్రకృతి శక్తి జెన్ సెంటర్లు ఎంతో ప్రయోజనకారి అనీ, స్కూల్ పిల్లలకు ఫామ్ టూర్లు, కార్పొరేట్ వ్యవస్థల్లో పని చేస్తున్న వారికి ప్రకృతి చికిత్సలు, యోగా, పంచకర్మ, శతక్రమ శిరోధార, అభ్యంగనం, హైడ్రోథెరపీ, మడ్ ప్యాక్స్, నేచర్ వాక్, మెడిటేషన్ కోర్సులతో ఇతరేతర సాత్వికాహారాన్ని అందిస్తూ కార్పొరేట్ ప్యాకేజ్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. కార్పొరేట్లకు ఇక్కడ ఫామ్ టూరిజం, హెల్త్ టూరిజం, స్పిరిట్చ్యువల్ టూరిజం వినూత్నమైన కాంబినేషన్ కనిపిస్తుందనీ, వ్యవ సాయ పర్యాటనలో పొలం గట్లపై నడుస్తూ, పశువులను, పక్షులనూ చూస్తూ, ఇక్కడ తయారయ్యే మూలికల తయారీ గురించి తెలుసుకుంటూ, తేనేటి విందు ఆస్వాదిస్తూ ఆయుర్వేదిక సేవలను అందుకోవచ్చన్నారు. కాలుష్య రహితమైన వైదిక, హరిత సమావేశ కేంద్రాలను వినియోగించుకుంటూ ఇకో ఫ్రెండ్లీ పద్ధతిలో సమీక్షా సమావేశాలు నిర్వహించుకునేలా ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆండాలు ఆయుర్వేదిక్ ఆశ్రమం డైరెక్టర్ మాడుగుల దీప్తి రెడ్డి, డైరెక్టర్స్ ముకుంద్, ప్రణీత, తదితరులు పాల్గొన్నారు.