Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
చైత్ర నవరాత్రుల సంద్రాభంగా మా వైష్ణవ దేవి విశాల్ జాగరణ్ను ఈ నెల 25వ తేదీన వైభవంగా నిర్వహించనున్నట్టు మా వైష్ణవ దేవి జాగరణ్ మండల్ చైర్మన్ అంజనీ కుమార్ అగర్వాల్ తెలిపారు. శనివారం వైష్ణవ దేవి విశాల్ జాగరణ్ ఏర్పాట్ల ప్రారంభ సూచికగా గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌లో మా వైష్ణవ దేవి జాగరణ్ మండల్ కోర్ వర్కింగ్ కమిటీ సభ్యులు బుధవారం శంకుస్థాపన చేశారు. ఏర్పాట్లను పరిశీలించి అంజనీ కుమార్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ శాంతిని ప్రోత్సహించడానికి, మానవజాతి శ్రేయస్సు కోసంతో పాటు హిందూ ధర్మ పరిరక్షణ కర్తవ్యంలో భాగంగా శారదీయ నవరాత్రుల సంద్రాభంగా గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌లో భారీఎత్తున మా వైష్ణవ దేవి విశాల్ జాగరణ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. జమ్మూలోని మా వైష్ణవ దేవి మాత ఆలయం పూజారి శ్రీ లోకేష్ జి పూజారి ఈ జాగరణ్ లో పూజలు నిర్వహిస్తారనీ, ప్రారంభానికి గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్, ప్రభుత్వ ఉన్నదికారులను ఆహ్వానించామన్నారు. దాదాపు 20 వేల మంది భక్తులు హాజరవుతారని చెప్పారు. ఉచిత ప్రవేశం, ఫలహారాలతో పాటు భోజనం సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ప్రత్యేకంగా జమ్మూలోని మా వైష్ణవ దేవి మాత ఆలయం నుంచి తెప్పించిన ప్రసాదం, ఖజానాలను 5 వేల మంది భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ జాగరణ్‌లో టి.సిరీస్ ఫేమ్ గాయకుడు కుమార్ విషు, కలకత్తాకు చెందిన ప్రముఖ భక్తి పాటల గాయకుడు నవీన్ జోషితోపాటు స్థానిక గాయకులు పాల్గొంటారని తెలిపారు. 25న సాయంత్రం 7 గంటలకు జాగరణ్ ఆకాంధ్ జ్యోత్ వెలిగించడంతో ప్రారంభమౌతుందనీ, దేవి పూజల అనంతరం కళాకారులు భజనలు, పాటలతో భక్తి వాతావరణాన్ని సృష్టిస్తారనీ, భక్తులు 'మాతా కా జాగరణ్' సమయంలో అమ్మవారి ఉనికిని అనుభవి స్తారనీ, అన్ని చెడుల నుండి రక్షిస్తాయని, ప్రజల మధ్య బంధాలను బలోపేతం చేసే ఈ మా వైష్ణవ దేవి విశాల్ జాగరణ్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని కోరారు. ఈ జాగరణ్ మహా ఆరతిలో తెల్లవారు జామున ముగుస్తుందని అంజనీ కుమార్ అగర్వాల్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మా వైష్ణవ దేవి జాగరణ్ మండల్ కోర్ వర్కింగ్ కమిటీ సభ్యులు రామ్ కిషన్ అగర్వాల్, రాకేష్ నర్సింగ్ పురియా, సంజరు అగర్వాల్, అంజనీ సర్వయోగి, రాకేష్ అగర్వాల్, మనీష్ అగర్వాల్, రాకేష్ జలన్, ధీరజ్ అగర్వాల్, సూర్య కమల్ గుప్తా, లలిత్ అగర్వాల్, హరి ఓం గార్గ్, తదితరులు పాల్గొన్నారు.