Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన నలుగురు సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ రూ.8.50 లక్షల విలువ చేసే చెక్కులను ఆదివారం స్వయంగా వారి ఇంటికి వెళ్లి అందజేశారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దూలపల్లి గ్రామంకు చెందిన అనురాధకు రూ.3లక్షలు, బక్కలయ్యకు రూ.1 లక్ష, కొంపల్లికి చెందిన లక్ష్మణ్‌కు రూ.2లక్షలు, గాజులరామారం ఉషోదయ కాలనీకి చెందిన పరమేశ్వరా చార్యకు రూ.2.50లక్షల విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి స్థానిక ప్రజాప్రతి నిధులు, నాయకులతో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు సంజీవని లాంటిదన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల ఆరోగ్య శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కింద నిధులు మంజూరు చేస్తొందన్నారు. ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఎలాంటి ఆపద సంభవించిన నేనున్నాను అనే ధైర్యం నింపుతు అండగా నిలుస్తున్నారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.