Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కుత్బల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ డివిజన్ రంగారెడ్డి నగర్ ప్రాంతానికి చెందిన మానస టూల్ టెక్ అదినేత, ఆత్మీయ బారతి సాహిత్య సేవ సంస్థ అద్యక్షులు , అభినవ కవి, పుడమి రత్న అవార్డు గ్రహిత, వాకిటి రామ్ రెడ్డి కి ఆరుదైన పురస్కారం లభించింది. ప్రపంచ నీటి వారోత్సవాలు సందర్భంగా తెలంగాణ జలమండలి, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నగరం లోని బంజరాహిల్స్ మినిస్టర్స్ క్లబ్లో నిర్వహించిన జలకవితోత్సాహంలో తెలంగాణ జలనిపుణులు వినోద కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జలపరిరక్షణపై కవి వాకిటి రామ్ రెడ్డి పాడిన జలసంరక్షణకు ''జైకొట్టి కదులురా జలసంరక్షణ నీ ధ్యేయం చేయరా'' ..పాటను ప్రశంసిస్తూ సమాజ చైతన్య పాటలు వ్రాసి పడుతున్న రామ్‌రెడ్డిని శాలువాతో సన్మానించి మెమొంటో అందించి ''జలకవిరత్న పురస్కారం'' అందచేశారు. సభాద్యక్షులు గాంధీ గ్లోబల్ చైర్మెన్ గున్న రాజేందర్ రెడ్డి మాట్లడుతూ తరిగిపోతున్న నీటినిల్వలపై జలకవితో త్సవం నిర్వహించటం ఈ కార్యక్రమంలో వందమంది కవిపుంగవులు పాల్గొని రేపటితరానికి జలస్ఫూర్తిని కలిగించారని, రామ్‌రెడ్డి పాట స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అనంతరం కవి వాకిటి రామ్‌రెడ్డి మాట్లడుతూ నీటివారోత్సవాలలో పాల్గొనే అవకాశం కల్గించిన గాంధీ గ్లోబల్, తెలంగాణ జలమండ లికి, కాళేశ్వరంతో జన కన్నీళ్లు తుడిచిన సీఎం కేసీఆర్‌కు ఈ సందర్భంగా కృత్ఞతలు తెలిపారు. ప్రతిఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని చేప్పారు. ఈ కార్యక్రమములో జలమండలి, నీటిపారుదల అధికారులు గాంధీ గ్లోబల్ ప్రతినిథులు గోపాల్ జి, యానాల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు .ఈ సందర్భంగా వాకిటి రామ్‌రెడ్డిని, ఆత్మీయ భారతీ సాహిత్య సేవా సంస్థ కార్యవర్గం, పలువురు బంధుమిత్రులు అభినందించారు.