Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వచ్ఛ ఆటోల సమస్యలను పరిష్కరించాలి
- జీపు జాతాలో ప్రజాసంఘాల నాయకులు
నవతెలంగాణ-హైదరాబాద్
జీయాగుడ కామెలా ఆధునీకరణ పనులు ప్రభుత్వం తక్షణమే చేపట్టాలని ప్రజాసంఘాల నాయకులు శ్రావణ్ కుమార్, ఆశాలతాలు డిమాండ్ చేశారు. జీయాగుడ కామెలా, చెత్త డంపింగ్ యార్డులలో ఆదివారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జీపు జాత, పాదయాత్ర నిర్వహిం చారు. జియగుడ కమేల ఆధునీకరణ పనులు ప్రభుత్వ ఆధ్వర్యంలో తక్షణం ప్రారంభించాలని, రాంకీ నిర్వహిస్తున్న చెత్త డంపింగ్ యార్డ్లో స్వచ్ఛ ఆటోల నుంచి చెత్త సేకరణకు 3 నుండి 6 గంటలు సమయం పడుతుందని, బై పాస్ రోడ్ పై వెయిటింగ్ చేయాల్సి వస్తున్నదని పెట్రోల్ ఖర్చులు, సమయం వధా అవుతున్నాయని కార్మిక, వత్తి దారులు, ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రజాసంఘాల నాయ కులకు వినతి పత్రాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐటీ యూ, ఐద్వా, అవాజ్ తదితర ప్రజాసంఘాల నాయకులు శ్రావణ్ కుమార్, ఆశాలతా, బాలు, సత్తార్లు మాట్లా డుతూ.. కమల ఆధునికరణం వెంటనే చేయా లన్నారు. కులవత్తిదారులు అనేక మంది కార్మికులు జీవనో పాధి పొందుతున్నారన్నారు. డంపింగ్ యార్డ్ స్వచ్ఛ ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు . ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పై పోరాటానికి సీఐ టీయూ తదితర సంఘాలు కషి చేస్తాయని, త్వరలో మరో దఫా ఈ సమస్యల పై అధికారులను కలుద్దామని నాయకు లు చెప్పారు. నినాదాలు చేసుకుంటూ పాదయాత్ర చేసిన సంఘాలను, కమేల పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో సంఘాల నాయకులు కష్ణ, నాగేశ్వర్, విఠల్, చుక్క నర్సింహ, ఎం.మీన, జె.యాదయ్య, రంగన్న, సుంకన్న లక్ష్మమ్మ, కళ్యాణ్, సాంబయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.