Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పౌర హక్కు ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్
నవతెలంగాణ-అంబర్పేట
దండకారణ్య ఆదివాసీల గ్రామాలపై నిర్వహిస్తున్న వైమానిక దాడులను తక్షణమే నిలిపివేయాలని పౌర హక్కు ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ అన్నార ు. దండకారణ్య ఆదివాసీలపై గగనతల దాడులను ఆపాలని డిమాండ్ చేస్తూ పౌర హక్కుల సంఘం, ప్రజాస్వామిక హక్కుల సంఘాల సమన్వయ సంస్థల సంయుక్త ఆధ్వ ర్యంలో బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆది వారం సభ జరిగింది. ఈ సభలో ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన పాలకులు ప్రజల ప్రాథమిక హక్కులను అణిచి వేయడంలో పోటీ పడుతున్నారని విమర్శించారు. మన దేశ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, పాలించే పాలకులు బహుళ జాతి కంపెనీల గుప్పిట్లో బంధీలుగా మారినట్టు పేర్కొ న్నారు. ప్రముఖ సామాజిక వేత్త హిమాంశ్ కుమార్, చత్తీస్ ఘడ్ ఆదివాసీ నాయకురాలు హిడ్మే మాట్లాడుతూ ఆదివాసీ గ్రామాలపై కేంద్ర ప్రభుత్వ బలగాలు దాడులు చేయడమే కాకుండా, మహిళలను హత్య చేస్తున్నారని అన్నారు. మావో యిస్టు ఉద్యమాన్ని సాకుగా చూపి ఆదివాసీలు లేకుండా చేసి, ఇక్కడి భూగర్భ గనులను బహుళజాతి కంపెనీలకు అప్పజెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలకు పాల్ప డుతోం దని అన్నారు. ఆదివాసీలను వైమానిక దాడుల నుంచి కాపాడేందుకు ప్రజాస్వామ్య వాదులు గొంతు విప్పాలన్నారు. కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్య దర్శి ఎన్. నారాయణ రావు, ఏపీ కార్యదర్శి చిలుక చంద్ర శేఖర్, ఆదివాసీ నాయకులు మంగ్లు తదిత రులు పాల్గొ న్నారు. సభలో ప్రజా కళా మండలి కళాకారులు ఆదివాసీ ఉద్యమ గీతాలను ఆలపించారు.