Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశాలత
నవతెలంగాణ -హైదరాబాద్
బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాద విధానాలను తిప్పి కొట్టాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశాలత అన్నారు. ప్రజా సంఘాల కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ సౌత్ కమిటీ ఆధ్వర్యంలో జీప్ జాత ఆదివా రం గుడిమల్కాపూర్ మార్కెట్లో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మార్చి 23 నుండి 27 వరకు నగరవ్యాప్తంగా బస్తీలు, కాలనీలు, చౌరస్తాలలో సభలు నిర్వహించి బీజేపీ విధానాలపై ప్రజలను కార్మికు లను మహిళలను చైతన్యవంతం చేస్తుందని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో దేశంలో ప్రజల మధ్య మతం పేరుతో వైశ మ్యాలను తీసుకువచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులు ప్రమాదంలో ఉన్నారు అనే పేరుతో మైనారిటీ మతస్తులపై దాడులు చేయిస్తుందన్నారు. మోడీ అధికారం లోకి వచ్చిన తర్వాత ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. పభుత్వ సంస్థలను పెట్టుబడిదారులకు కారు చౌకగా మోడీ ప్రభుత్వం అప్పగిస్తుందని మండిపడ్డారు. సీబీఐ, ఈడి, ఐటి లను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని అన్నారు. ఇప్పటివరకు దేశంలో ఒక్క అధికార పార్టీ నాయకుడిపై కూడా దాడులు జరగలేదని అన్నారు. మార్చి 29న ఇందిరాపార్క్ వద్ద జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీఐటీయు నగర కార్యదర్శి శ్రావణ్ కుమార్, అధ్యక్షు రాలు మీనా, ఐద్వా కార్యదర్శి శశికళ, లక్ష్మమ్మ, గిరిజన సంఘం కార్యదర్శి బాలునాయక్, ఆవాజ్ నగర కార్యదర్శి అబ్దుల్ సత్తార్, డివైఎఫ్ఐ నగర కార్యదర్శి కృష్ణ నాయక్, సీఐటీయు నగర కమిటీ సభ్యులు విటల్ కిషన్, రాములు, జంగయ్య, కోటయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రజాసంఘాల ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న జీపు జాతలో ఐద్వా జియగుడ కమిటి సభ్యులు, ప్రజాసం ఘాల నాయకులకు భీమ్ నగర్ భగత్ సింగ్ విగ్రహం వద్ద సభ నిర్వహించారు. ఈ సభలో స్థానిక మహిళలు ప్రజాసం ఘాల నాయకులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కేఎన్.ఆశాలత మాట్లా డుతూ మహిళలకు స్థానికంగా ఉపాధి కల్పించేం దుకు కుట్టు మిషన్లు, కంప్యూ టర్ ట్రైనింగ్ తదితర శిక్షణా కేంద్రా లు కల్పించాల న్నారు. ప్రతీ డివిజన్లు లో 5 కేంద్రాలు ఏర్పా టు చేయాలన్నారు. గ్యాస్ సిలిండర్ల ధర తగ్గించాలని, డబుల్ బెడ్ రూం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఐద్వా నాయ కులు ఎన్.లావణ్య, ఎస్.సునీత, శంకరమ్మ, వై.లక్ష్మి పాల్గొన్నారు.
ప్రజా సమస్యలను పరిష్కరిం చడంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం తగదని ప్రజా సంఘాల నాయకులు, శశికళ, శ్రావణ్, అశాలత, విఠల్, నాగేశ్వర్, చుక్క నర్సింహలు అన్నారు. ఏప్రిల్ 5వ తేదీన చేపట్టిన చలో ఢిల్లీ నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ, ఐద్వా, తదితర ప్రజాసం ఘాల నాయకులు జీపు జాతా ఆది వారం జియాగూడ భీమ్ నగర్ ప్రాంతాల్లో జరిగింది. ఈ సందర్భంగా భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు నివాళులు అర్పించారు. అనంతరం ఈ జీపు జాతా జీయగుడ కమేలా, చెత్త డంపింగ్ యార్డ్ కు చేరుకున్నది. వారు మాట్లాడుతూ నిత్యావసర ధరలు అధికంగా పెరగడానికి కారణమైన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయాల న్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి త్వరలో సంభందిత అధికారులను కలుస్తామని వారు తెలిపారు. జిల్లా ప్రజాసం ఘాల నాయకులు అబ్దుల్ సత్తార్, బాలు కృష్ణ, లక్ష్మమ్మ, మీన, కవిత స్థానిక కార్యకర్తలు ఎన్ లావణ్య, రాజు, సాంబ య్య, రాములు, సునీత, వై.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.